త్వరలోనే 2025 సంవత్సరం ప్రారంభం కానుంది రాహు, కేతువుల గ్రహాలు ఎక్కువగా సంచరిస్తాయి. ముఖ్యంగా తొమ్మిది గ్రహాల్లో రాహు కేతు గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది 12 రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కొత్త సంవత్సరంలో ఈ రాహు కేతువుల కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశి- మీన రాశి వారికి రాహు కేతువుల కలయికతో రాబోయే 2025 వ సంవత్సరం అన్ని శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని కూడా పూర్తి చేస్తారు. వ్యాపార సంబంధ ప్రయాణాలు మీకు లాభాలను అందిస్తాయి. వ్యాపారం పరంగా అనేక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Vastu Tips: ఇంటి హాలులో టీవీ ఏ దిక్కున ఉండాలి?
సింహరాశి- కొత్త సంవత్సరంలో సింహ రాశి వారికి అనేక సానుకూల ఫలితాలు ఉన్నాయి. వీరు సమాజంలో గౌర ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మంచి సమయం ఉపాధి స్థాయి పెరుగుతుంది. యువతకు కోరుకున్న రంగాల్లో ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు.
కుంభరాశి- అదే కుంభరాశి వారికి రానున్న 25వ సంవత్సరం మంచి ఫలితాలు ఉన్నాయి. వీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే కళ నెరవేరుతుంది. రాహు కేతువుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది మీ జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.