astrology

Astrology: ఆదివారం సెలవు దినం కాబట్టి చాలామంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు.అయితే అవి వారికి తెలియక చేసే పొరపాట్లు పెద్ద పెద్ద హానిని కలిగిస్తాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైనటువంటి పనులు అస్సలు చేయకూడదు. వీటివల్ల ధన నష్టం కెరీర్లో నష్టాలు, ఆర్థిక నష్టాలు, ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అయితే ఆదివారం రోజు ఏ పనులు చేయకూడదు. ఇప్పుడు తెలుసుకుందాం..

గోర్లు కత్తిరించవద్దు- ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా గోర్లు కత్తిరించుకోకూడదు. ఇది చాలా అశుభవం దీని వల్ల అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన నష్టాలు వస్తాయి. అంతేకాకుండా శనివారం గురువారం కూడా గోర్లను కత్తిరించుకోకూడదు. దీని వల్ల కూడా అనేక రకాల సమస్యలు వస్తాయి. ఈ పనులు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే విధంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా అపజయం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం రోజు గురువారం రోజు శనివారం రోజు గోర్లను కత్తిరించుకోకూడదు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బులను ఎక్కడ దాచుకోవాలి, 

జుట్టు కత్తిరించుకోకూడదు- ఆదివారం రోజు సెలవు దినం కావడంతో చాలామంది ఆదివారం రోజు జుట్టు కట్ చేయించుకుంటూ ఉంటారు. ఇది కూడా అంత మంచిది కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము జుట్టు కూడా ఆదివారం రోజు కట్ చేయించుకోకూడదు. దీని వల్ల కూడా శనిదేవుడికి కోపం వచ్చి అనేక రకాల నష్టాలను ఇస్తాడు. ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడతాయి.

రాత్రిపూట గోర్లు కత్తిరించవద్దు- రాత్రిపూట గోర్లు జుట్టు రెండిటిని కూడా కత్తిరించవద్దు. అని జ్యోతిష శాస్త్రంలో పేర్కొనబడింది. కాబట్టి మీరు ఉదయం పూటనే స్నానం చేసిన తర్వాతనే ఉదయం సమయాలలో మాత్రమే గోర్లు చుట్టూ కత్తిరించుకోవాలి. సూర్యాస్తమయం సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో జుట్టు గోర్లు, కత్తిరించుకోకూడదు. ఇది ఇలా చేయడం వల్ల ధనికులు పేదవారుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నష్టం ఏర్పడుతుంది. ఇంట్లో కలహాలు ఏర్పడతాయి.

ఏ రోజు అనుకూలమైన రోజు- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోర్లు జుట్టు కత్తిరించుకోవడానికి అనుకూలమైన రోజులు బుధవారం ,శుక్రవారం గా చెప్పవచ్చు. బుధవారం రోజు గోర్లు కత్తిరించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. సంపద పెరుగుతుంది కెరీర్ లో అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా శుక్రవారం రోజు కూడా గోర్లు జుట్టు కట్ చేసుకోవచ్చు. దీని వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.