astrology

జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపదను ఆనందాన్ని శ్రేయస్సును పెంచే గ్రహంగా శుక్ర గ్రహం ఉంటుంది. ప్రస్తుతం శుక్ర గ్రహం మకర రాశిలో ఉన్నాడు. డిసెంబర్ మూడో తేదీన రాత్రి 11 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్ర గ్రహ సంచారం కారణంగా అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశి- మకర రాశి వారికి శుక్రుని సంచారం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ కూడా ఇది శుభ సమయం పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వివాహాలకు కుటుంబ పెద్దల నుండి ఆమోదం లభిస్తుంది. వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటారు.

Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...

కుంభరాశి-  శుక్రుడు కుంభరాశి లోకి ప్రవేశించడం కారణంగా ఈ రాశి వారికి అఖండ ధన ప్రాప్తి ఉంది. కుంభ రాశి వారికి సంపద ఆస్తి పెరుగుతుంది. పూర్వికులు నుండి రావాల్సిన ఆస్తి లభిస్తుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. జీతం రెట్టింపు అవుతుంది ఆర్థికపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక పరిస్థితి గతం గడ్డ మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు మంచి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో పెట్టుబడులు లాభాన్ని పొందుతారు. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

తులారాశి- తుల రాశి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. ప్రేమ వివాహాలకు అనుకూలం మీరు పని చేసే చోట ప్రశంసలు పొందుతారు. పదోన్నతి లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కుంభరాశిలోకి సంచాయించడం ద్వారా పెట్టుబడి లో మీరు ముందుంటారు. అంతే విధంగా ఖర్చులు తగ్గుతాయి. పొదుపులో ప్రయోజనకరంగా మెలుగుతారు. సృజనాత్మకత పెరుగుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.