అట్ల తద్ది నోము అనేది ఆంధ్ర ప్రదేశ్ సాంప్రదాయ పండుగ సంతోషకరమైన సుదీర్ఘ వైవాహిక జీవితం కోసం గౌరీ దేవి ఆశీర్వాదం కోసం వివాహిత స్త్రీలు జరుపుకుంటారు. అలాగే పెళ్లి కాని వారు మంచి భర్త దొరకాలని ఈ పండగ జరుపుకుంటారు. అట్ల తద్ది భారతీయ మాసం ఆశ్వీయుజ మాసంలో జరుపుకుంటారు. పౌర్ణమి తర్వాత మూడవ రోజు వస్తుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం అక్టోబర్ 31న వస్తుంది.
అట్ల తద్ది వెనుక కథ
పురాణాల ప్రకారం, అట్ల తద్ది అనేది గౌరీ దేవిచే సూచించబడిన ఒక ఆచారం, ఇది పెళ్లికాని యువతులందరూ తగిన వరుడి కోసం ఆమె ఆశీర్వాదం కోసం ఆచరించాలని సూచించారు.
అట్ల తద్దిపై ఆచారాలు:
> ఈ రోజున, వివాహిత స్త్రీలతో పాటు యువతులందరూ తెల్లవారుజామున నిద్రలేచి, తల స్నానం చేసి, సూర్యోదయానికి ముందే అన్నం తింటారు. తర్వాత రోజంతా ఉపవాసం ఉంటారు.
>> అట్ల తద్ది మందు రోజున మహిళలు, బాలికలు తమ అరచేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. వివాహిత స్త్రీలు సాంప్రదాయ దుస్తులు, నగలు ధరిస్తారు.
>> రోజంతా సంప్రదాయ పాటలు పాడుతూ, ఊయల ఊగుతూ ప్రత్యేక ఆహారాన్ని సిద్ధం చేసుకుంటారు.
>> సాయంత్రం వేళ, స్త్రీలు నిండు చంద్రుడిని నీటిలో చూసి, గౌరీదేవికి పది దోసెలు సమర్పించి పూజిస్తారు.
>> ఈ పది దోసెలు వివాహిత స్త్రీలకు భోజనంలో పెడతారు.
>> పూజ కోసం, బియ్యం గింజలపై 'కలశం' తయారు చేస్తారు.వెండి నాణేలు, పూలు, మామిడి ఆకులు, పసుపు కుంకుం వంటి ఇతర అంశాలు ఇందులో ఉంటాయి.
>> అట్ల తద్ది కోసం పాల తాళికలు (బియ్యం పిండి, బెల్లం, పాలతో చేసిన తీపి వంటకం), పదకొండు కూరగాయలతో సాంబారు, గోంగూర పచ్చడి వంటి ప్రత్యేక వంటకాలు తయారుచేస్తారు.