ayyappa (Representative image)

జ్యోతిస్వరూపుడు.. హరిహరసుతుడు.. శబరిమల మీద కొలువై ఉన్న దేవదేవుడు, ప్రతి సంవత్సరం వందల మంది స్వామి దీక్ష చేబట్టి జ్యోతి దర్శనం కోసం శబరికి వెళతారు. శక్తిరూపుడైన అయ్యప్ప దీక్షను ఆచరిస్తారు. శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో కఠిన నియమ, నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు.

బుధవారం వినాయకుడితో పాటు అయ్యప్ప స్వామి కి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు.ఈరోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణలు పూజలు నిర్వహించి స్వామి వారిని వేడుకుంటారు. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలలు ధరించిన భక్తులు ఎంతో కఠిన నియమాలను పాటిస్తూ స్వామి వారి సేవలో ఉంటారు.ప్రతి రోజు నిత్య పూజలతో, భజన సేవలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారు.

అయ్యప్ప స్వామి అయ్యా అంటే విష్ణువు, అప్ప అనగా శివుడు అని అర్థం.వీరిద్దరి కలయిక వల్ల జన్మించినందుకు గాను ఈ స్వామి వారిని అయ్యప్ప అని పిలుస్తారు. రాక్షసులు దేవతలు క్షీరసాగర మధనం చేస్తున్నప్పుడు అమృతాన్ని పంచడానికి సాక్షాత్తు శ్రీ విష్ణు భగవానుడు మోహిని అవతారంలో వస్తాడు.మోహిని అవతారంలో ఉన్న విష్ణుకి, శివునికి పుట్టిన బిడ్డగా అయ్యప్పను భావిస్తారు.

దక్షిణ భారత దేశంలో అయ్యప్ప స్వామిని ఎక్కువగా పూజిస్తారు.మహిషి అనే రాక్షసిని చంపిన తర్వాత అయ్యప్పస్వామి శబరిమలలో కొలువై ఉన్నాడు. మన హిందూ ప్రధాన ఆలయాలలో శబరి ఎంతో ప్రసిద్ధి చెందినది.అయితే ఈ ఆలయంలో అయ్యప్ప స్వామిని బ్రహ్మచారిగా పూజిస్తారు. కేరళలోనే కుళతుపుళలో స్వామివారిని బాలుని రూపంలో అర్చిస్తారు.

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అయ్యప్ప మాలలు ధరించి దీక్షలతో ఉన్న భక్తుల మకర సంక్రాంతి రోజున పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందుతారు. ఇంతటి గొప్ప మహిమలు కలిగిన అయ్యప్ప స్వామిని బుధవారం పూట పూజించడం ద్వారా సకల సంతోషాల తో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.