తెలంగాణ సంస్కృతిని ఇక్కడి మట్టి మనుషుల సున్నితత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన వేడుక "బతుకమ్మ". పూలను దైవంగా కొలిచి ప్రకృతిని ఆరాధించే విశిష్టత, తెలంగాణ నేలకు సొంతం. తెలంగాణ ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మీ బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటున్నారా..అయితే ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఫోటో గ్రీటింగ్స్ ఉన్నాయి. వీటిని డౌన్ లోడ్ చేసుకొని మీ స్నేహితులకు ఫార్వార్డ్ చేయండి.
తీరొక్క పూలతో తీర్చిదిద్ది.. ఆటపాటలు, కోలాటాలు అవధుల్లేని ఆడబిడ్డల ఆనందాలతో జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆడబిడ్డలందరికి ఎంగిలిపూల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు.
మన తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ.. బతుకమ్మ పండుగ ప్రారంభం (ఎంగిలిపూల బతుకమ్మ) సందర్భంగా ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.
తెలంగాణ సంస్కృతి,సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ... తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..
పూలను పూజించే, ప్రకృతిని ఆరాధించే ఆడబిడ్డల పూల పండుగ మన బతుకమ్మ వేడుక. ఆడబిడ్డలందరికి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు.
పూల సందళ్లు, ఆడబిడ్డల ముచ్చట్లు.. గాజుల చప్పట్లు, తెలుగింటి అందాల ఆరట్లు. పాడే పాటల్లో పడతుల గాధలు... పసుపు గౌరమ్మలు, సద్దుల కమ్మదనాలు.. అన్నీ ఇవన్నీ కలిపితే మన బతుకమ్మ పండుగ.. ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు