Merry Christmas

ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా దేశం మొత్తం క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవులు తమ ఇంటిలో క్రిస్మస్ ట్రీ లను, క్రిస్మస్ స్టార్ లను ఏర్పాటు చేసుకుని, విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరిస్తారు. ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రతి చర్చ్ లలో క్రిస్మస్ ట్రీ లను ఏర్పాటు చేయడం మనం చూసే ఉంటాము.

అయితే క్రిస్టమస్ రోజున ఈ ట్రీ ను ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? క్రీస్తు పుట్టిన రోజుకు, క్రిస్టమస్ ట్రీ ను పెట్టడానికి సంబంధం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారి వచ్చే క్రైస్తవులకు అతి పెద్ద పండుగ.ఈ పండుగ రోజు క్రైస్తవులు తమ బంధువులకు స్నేహితులకు బహుమతులను అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు.పూర్వం క్రైస్తవులందరూ కానుకలను తీసుకొని చర్చి కి వెళ్ళడం ఒక ఆనవాయితీగా ఉండేది.ఒక ఊరిలో నివసిస్తున్న ప్లాబో అనే పేద పిల్లవాడికి కానుకగా తీసుకెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోతే తన ఇంటి ముందు ఎంతో అందంగా పెరిగిన మొక్కను కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకెళ్లాడు.

అక్కడ అతని కానుక చూసి అందరూ ఎగతాళిగా నవ్వుకుంటారు.అయితే ఆ బాలుడు ఆ చెట్టును తీసుకెళ్లి క్రీస్తు ముందు ఉంచుతాడు. ఉన్నఫలంగా ఆ చెట్టు బంగారు చెట్టుగా మారిపోతుంది తనను చూసి నవ్వుకున్న వారందరూ తల దించుకున్నారు.ఏవైనా కానుకలు ఇచ్చేటప్పుడు సహృదయంతో ఇవ్వడమే ప్రధానమని తెలియజేశారు. అప్పటి నుంచి ఆ చెట్టును క్రిస్మస్ ట్రీ గా ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ రోజు అలంకరించుకుంటారు.

క్రిస్మస్ పండుగ రోజు ఫర్‌ చెట్టు గా పిలవబడే క్రిస్మస్ ట్రీ అలంకరించడం పదవ శతాబ్దం నుంచి ప్రారంభించారు.1832లో ప్రొఫెసర్‌ చార్లెస్‌ ఫోలెన్‌ క్రిస్మస్ ట్రీ ను కొవ్వొత్తులు వెలిగించి అలంకరించారు.రాను రాను ఈ క్రిస్మస్ ట్రీను విద్యుత్ దీపాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రిస్మస్ పండుగ కోసం ప్రతి ఏటా కొన్ని వేల సంఖ్యలో ఈ ఫర్ చెట్లను పెంచుతున్నారు.ఈ విధంగా ప్రతి క్రిస్మస్ పండుగకు క్రిస్మస్ ట్రీ లను పెట్టుకొని ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.