Merry Christmas | (Photo Credits: Pixabay)

Christmas Eve 2021 Greetings: ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో పవిత్రంగా క్రిస్ మస్ వేడకులను జరుపుకుంటారు. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అంతేకాదు కేకులు కోసి తమ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా క్రిస్మస్ పండుగ సందడే కనిపిస్తోంది. ఈ పండుగ సమయంలో చాలా మంది బహుమతుల కోసం ఎదురుచూస్తుంటారు.

అందుకే ఈ పండుగ వేళ కాస్త ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపేందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందే.. మన దేశంలో క్రిస్మస్ పండుగను మతాలకు అతీతంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ క్రిస్మస్ వేడుకల్లో ఆనందంగా పాల్గొంటారు. క్రైస్తవ సోదరీ సోదరులకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు.. అనేక చోట్ల పిల్లలు, పెద్దలు కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఇలాంటి పార్టీలను చేసుకొనే సంప్రదాయం ఎన్నో ఏళ్ల నుండి వస్తుంది. ఎందుకంటే ఆనందంలోనే పరమార్థం ఉందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు.

ఈ క్రమంలో మీరు కూడా క్రిస్మస్ సందర్భంగా మీతో పాటు మీ స్నేహితులతో.. కుటుంబసభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులతో క్రిస్మస్ విషెస్, గ్రీటింగ్స్, అద్భుతమైన కోట్స్, వాట్సాప్ మరియు ఫేస్ బుక్ మెసెజ్ లను షేర్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో క్రిస్మస్ సందర్భంగా మీ స్నేహితులతో పంచుకోదగిన శుభాకాంక్షలను మీ ముందు ఉంచుతున్నాం.

 

క్రిస్‌మస్‌కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్‌లను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటిపై వేలాడ దీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్‌మస్‌ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగు రంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత.