ఆకస్మిక ధనలక్ష్మీ సాధన ద్వారా ఎప్పుడు ఎలాంటి ధన అవసరం ఉన్నా, దానికి తగ్గ ధనం ఎప్పటికప్పుడు మీకు సమకూరుతుంటుందనే దీని అర్థం. అంటే ధనావ సరం ఉన్నప్పుడు మీరు గనుక 'ఆకస్మిక ధనలక్ష్మీ సాధన' చేస్తే అవసరం గడుస్తుందని నిశ్చింతగా భావించవచ్చు. మీకు ఎంత డబ్బు ఉన్నాసరే, మీరు ఎంత ధనికులైనా సరే, కొన్ని సందర్భాలలో మీకు చేతికి డబ్బు అందని స్థాపించండి. స్థితి, చేతిలో డబ్బు ఆడని స్థితి కూడా సంభవించవచ్చు. అలాంటి సమయాల్లో కూడా ఆకస్మిక ధనలక్ష్మీ సాధన తిలకాలు అద్దండి. మంచిది. కొన్ని సందర్భాలలో మీ బంధువులు, స్నేహితులు ఆఖరికి సొంత అన్నదమ్ములు సైతం మీకు అవసరానికి తోడ్పడరు. అలాటప్పుడూ మీరు ఆకస్మిక ధనలక్ష్మీ సాధన చేపట్టండి. ధనబలం కలుగుతోంది. విజయం మీదవుతోంది.
ఆకస్మిక ధనలక్ష్మీ సాధన ఎందుకు చేయాలి ?
>> ప్రస్తుతం ఉన్న సంకట స్థితి నుంచి బయటపడేందుకు
>> రాగల కష్టాలను నివారించుకోవటానికి.
>> ఆకస్మిక ధనావసరాలు రాకుండా ఉండేందుకు
>> ధనం లేకపోయిన కారణంగా, ఆగిపోయిన పనులు త్వరగా పూర్తి కావటానికి
>> నిరంతరం లక్ష్మీ కటాని పొందటానికి 'ఆకస్మిక ధనలక్ష్మీ సాధన మంచిది.
ఎప్పుడు చేయాలి?
దీపావళి అంటే మహా నిశిరాత్రి సమయంలో చేయవచ్చు. లేదా ధన త్రయోదశి నుంచి వరుసగా అయిదు రోజులైనా మంచిదే. సాధన రాత్రి 10 గంటల తర్వాతే మొదలు పెట్టడం మంచిది.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి
ఎలా చేయాలి?
1. సాధన సమయానికి ముందు శుచిగా స్నానం చేయండి.
2. పరిశుభ్రమైన ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. వీలైతే ఎరుపు రంగు ధోవతి, ఎరుపు రంగు శాలువా ధరించండి.
3. ప్రశాంతమైన స్థలంలో లేదా పూజా గృహంలో ఏకాంతంగా, తూర్పు అభిముఖంగా కూర్చోండి.
4. కూర్చునేందుకు వెదురు చాపలు వాడండి.
5. మీ ముందు లక్ష్మీదేవి ప్రతిమను పెట్టుకోండి.
6. మీ ముందు ఒక పీటమీద ఎర్రని వస్త్రాన్ని పరిచి, దానిమీద ఒక పళ్లాన్ని పెట్టండి. ఈ పళ్లెం మీద కుంకుమతో స్వస్తిక్ బొమ్మవేసి, దానికి చెరోవైపు శుభం, లాభం అని రాయండి.
7. ఇప్పుడు ఆ పళ్లెంలో నల్ల నువ్వులు పోయండి. మధ్యలో కొంచెం పెద్దదిగా ఉండేలా చేసి, దానిమీద రాగి రేకుపై ఉన్న లక్ష్మీ యంత్రం స్థాపించండి.
8. యంత్రం మీద కుంకుమ, పసుపు, చందనం, తిలకం అద్దండి.
9. ఇప్పడు యంత్రానికి అటూ ఇటూ ఉన్న నువ్వుల పోగుల మీద రెండు రక్తమణులు (గురువింద గింజలు) స్థాపించండి. వీటి మీద కూడా కుంకుమ అద్దండి.
10. ధూపదీప అగరువత్తులు వెలిగించండి. నేతి పాలు వెలిగించండి. యంత్రం మీద అత్తరు చల్లండి. మిఠాయిని ప్రసాదంగా పెట్టండి.
11. తర్వాత మీ కుడి చేతిలో కొంచెం నీళ్లు పోసుకుని, మీ కోరిక తల్చుకొని, అది తీర్చమని మనసారా ఆశిస్తూ ప్రార్థన చేయండి. తర్వాత సంకల్పం చేసి, నీళ్లు నేల మీద వదలండి. తర్వాత రెండు చేతులూ జోడించి ధ్యానం చేసుకోండి.
12. తర్వాత స్ఫటికమాల చేతబట్టుకొని, దిగువ మంత్రాన్ని 11 సార్లు జపమాలతో జపించండి. జపం చేస్తున్న సమయంలో మధ్యలో లేవవద్దు.
ఆకస్మిక ధన లక్ష్మీ మంత్రం:
ఓం ఐం హ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓమ్ |
>> మంత్రం జపించటం పూర్తయ్యాక, నిశ్చలంగా కూర్చొని, మనసులో లక్ష్మీదేవిని సంపూర్ణంగా స్మరించు కుంటూ, భవిష్యత్తు మీద పూర్తి విశ్వాసం ఉంచుకుంటూ, లక్ష్మీదేవిని ప్రార్థించండి.
>> దీని తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచండి. తర్వాత, మీరు పూజ చేసిన వస్తువులన్నిటినీ . కలిపి, వస్త్రంతో సహా, సమీపంలోని నది, లేకుంటే జలాశయంలో విసర్జించండి.
>> ఇది సాధ్యం కాకపోతే, సమీపంలోని లక్ష్మీదేవి ఆలయంలో సమర్పించండి. నువ్వుల్ని పక్షులకు వేయండి. మీ సమస్త కోరికలు తీర్చే ఆకస్మిక ధనలక్ష్మీ కటాక్షానికై ఇక ఎదురుచూడండి.