Dhanteras Wishes in Telugu (1)

ఈ ఏడాది 2025లో ధన త్రయోదశి (Dhantrayodashi) అక్టోబర్ 18 శనివారం జరగనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి అక్టోబర్ 18వ తేదీ మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1. 54 గంటలకు ముగుస్తుంది. ఇది ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ ప్రారంభాన్ని సూచించే అత్యంత శుభప్రదమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా దీపావళి 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగ ధన త్రయోదశితో ప్రారంభమవుతుంది. లక్ష్మీపూజ, ధన సంపద, ఆర్థిక శ్రేయస్సుకు ప్రతీకగా నిలుస్తుంది.

ధన త్రయోదశి రోజున భక్తులు భక్తి, శ్రద్ధ, నియమ నిష్టలతో లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజిస్తారు. ఈ పూజ ద్వారా అదృష్టం, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం వచ్చే నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ రోజు బంగారం, వెండి, రాగి, పంచ లోహ పాత్రలు వంటి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. బంగారం, వెండి కొనుగోలు చేయడం ద్వారా వచ్చే సంపద, శ్రేయస్సు సారం సంవత్సరాంతం నిలుస్తుందని నమ్మకం ఉంది.

ఇక లక్ష్మీదేవి, సకల సిరులు, అష్ట ఐశ్వర్యాలకు అధినాయకురాలు. ఈ ధన త్రయోదశి రోజున భక్తులు లక్ష్మీదేవి పూజతో సుఖ, శ్రేయస్సు, సంపదను ఆకర్షిస్తారు. అలాగే వినాయకుడి విగ్రహాలను కూడా ఈ రోజున కొనుగోలు చేయడం మంచిదని విశ్వసిస్తారు. రాబోయే ఏడాది ధన సంపద, ఆరోగ్యం, సుఖసంతోషాలు నిలువడానికి ఇది పెద్ద పాత్ర పోషిస్తుంది.

నాగుల చవితి ఎప్పుడు? స్త్రీలు నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు? పూజా సమయం, ఉపవాసం, నైవేద్యం, మంత్రాలు, పూర్తి సమాచారం ఇదిగో..

ధన త్రయోదశి రోజున కుబేరుడి పూజ కూడా ప్రత్యేకంగా జరుగుతుంది. కుబేరుడిని కుబేర యంత్రంతో ఆరాధించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం, అక్షయ సంపదలు వచ్చే నమ్మకం ఉంది. సంపదకు సంబంధించిన ఈ పూజ, వ్రతాలు, ఆరాధనల ద్వారా కుటుంబం, వ్యాపారం, ఉద్యోగాలలో శ్రేయస్సు సాధ్యమవుతుంది.

సాంప్రదాయం ప్రకారం.. ఈ రోజున ఇతరులకు అప్పు ఇవ్వకపోవడం, వృథా ఖర్చులు చేయకపోవడం వంటి నియమాలు పాటిస్తారు. అలాగే, బలహీనులకు దానం చేయడం, నైతిక పద్ధతిలో సంపదను వినియోగించడం ఉత్తమం అని భావిస్తారు.

ధన త్రయోదశి ఒక రోజు పండుగ మాత్రమే కాదు. రాబోయే ఏడాది సంపద, శ్రేయస్సు, ఆనందాన్ని ఆకర్షించే ఆధ్యాత్మిక, ఆర్థిక శుభకార్యంగా భావించబడుతుంది. భక్తి, శ్రద్ధ, సంపదను సంతరించుకోవడానికి ఈ రోజు చేసే పూజలు, ఆరాధనలు, బంగారం, వెండి కొనుగోళ్లు, కుబేర పూజలు అత్యంత ముఖ్యమైనవిగా ఉన్నాయి.