మకర సంక్రాంతి పండగ పండుగ సందర్భంగా చేయాల్సిన ముఖ్యమైన పనులను తెలుసుకుందాం. మొదటగా తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి ఆ తర్వాత తలస్నానం చేసే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత సూర్యనారాయణ మూర్తిని ఆరాధించాలి. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు సూర్యనారాయణమూర్తి ధను రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. సూర్యనారాయణ మూర్తి ని ఆరాధించిన తర్వాత పరమాన్నం వండాలి.
పరమాన్నం కూడా మెతుకులు లాగా కాకుండా ముద్దలాగా గట్టిగా వచ్చేటట్టు వండుకోవాలి. అలా ఎందుకు వండుకోవాలంటే సూర్యనారాయణ మూర్తి కి పళ్ళు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే పరమాన్నం తయారు చేసేటప్పుడు లేదా వండేటప్పుడు మీకు ఏ బాధలు ఉన్నాయో, ఆర్థిక సమస్య అయినా కావచ్చు ఇంకా వేరే ఇతర సమస్యలు ఉంటె అవి పోవాలని ఓం నమో సూర్య నారాయణ నమః అంటూ సమస్యలు తీరి పోవాలని కోరుకుంటే మీకు ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది.
నిజానికి సూర్యనారాయణ మూర్తిని పూజిస్తే, మీకు శత్రువులు ఉండరు, మీరు ఏ పని చేసినా కచ్చితంగా విజయం సాధిస్తారు, మీ సంపద నానాటికీ పెరుగుతూ పోతుంది, అలాగే ఇంట్లో ఉన్నటువంటి గొడవలను తేలిపోతాయి. సూర్య నారాయణమూర్తి ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటే మీకు అనుగ్రహం లభించి మీలో ఉన్న నెగిటివిటీ మటుమాయం అయిపోతుంది.
వాస్తవానికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే సూర్యనారాయణ మూర్తి ని ఆరాధించి, ఆదిత్య హృదయాన్ని చదివి రావణాసురునితో జరిగిన యుద్ధంలో గెలిచారు. అందుకే అంతటి శ్రీరాముడే సూర్యనారాయణమూర్తిని ఆరాధించినప్పుడు మీరు కూడా శ్రీరామచంద్రుని అనుసరించి మీకు ఉన్నటువంటి సమస్యలను తీర్చుకోండి. మీరు పైన చెప్పిన విధంగా సూర్యనారాయణ మూర్తిని ఆరాధించి, ఆదిత్య హృదయాన్ని చదివితే మీకు వచ్చే సంవత్సరం లోపు మీ జీవితంలో ఎన్నో మంచి విషయాలు చోటుచేసుకుంటాయని ఆధ్యాత్మికతవేత్తలు చెబుతున్నారు.