దుర్గా దేవి.. రాక్షస సంహారాణికై అమ్మవారు ఎత్తిన అవతారం. ఎందరో రాక్షసులను సంహరించి దేవతలకు, మానవులకు రక్షణగ నిలిచిన స్వరూపం దుర్గా రూపం, అమ్మవారి అత్యంత శక్తి వంతమైన రూపాలలో, అవతారాలలో దుర్గాదేవి అవతారం ఒకటి. దుర్గాదేవిని దసరా రోజు పూజిసై మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ విధానం తెలుసుకుందాం…
దసరా రోజు అమ్మవారిని ఆరాధించే విధానాలు పరిశీలిస్తే.. ఎరుపు రంగు పూలతో, ఎరుపు రంగు వస్త్రంతో అర్చించాలి. అదే విధంగా పూజ చేసేవారు కూడా ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. అమ్మవారికి దుర్గా సూక్తం. దుర్గా అష్టోత్తరం. దుర్గా స్తోత్రంతో పూజ చేయాలి. అదేవిధంగా అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు పరిశీలిస్తే… ఎరుపు రంగు పుష్పాలు, కనకాంబరాలు, మందారాలతో అమ్మవారికి పూజ చేయాలి. రేపు దుర్గ నామాన్ని అవకాశం ఉన్నన్ని సార్లు మనసులో జపించుకోండి.
దుర్గాదేవి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు.. పులగం, పరమాన్నం నివేదన చేయాలి. అదేవిధంగా ఈరోజు గుమ్మడికాయ, బెల్లం దానం చేయాలి. పై విధంగా ఎవడైతే అమ్మవారిని అర్చిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు, గ్రహ దోషాలు, సంతాన సమస్యలు, ఈతిబాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అవకాశం ఉన్నవారు పై విధంగా అర్చించండి. ఒకవేళ మీకు ఇంట్లో అర్చన అవకాశం లేకుంటే దగ్గరలోని దేవాలయం లేదా దుర్గాదేవిని దర్శించి ఆరాధించండి.