ప్రతి సంవత్సరం నవరాత్రి తర్వాత దసరా పండుగను జరుపుకుంటారు. ఇది హిందువుల ప్రధాన పండుగలలో ఒకటి. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు రావణుడిపై సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ మహిషాసురుడుపై దుర్గామాత సాధించిన విజయానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. దీనిని విజయదశమి అని కూడా అంటారు. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం, శ్రీరాముడు ఆశ్వీయుజ శుక్ల దశమి నాడు రావణుడిని చంపి, సీతను విడిపించాడు. ప్రతి సంవత్సరం ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజున రావణుడు, కుంభకరుడు, మేఘనాదుల దిష్టిబొమ్మలను అన్ని ప్రాంతాలలో దహనం చేస్తారు.
ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా జరుపుకోనున్నారు
బృందావనంకు చెందిన ఆచార్య రసరాజ్ మృదుల్ జీ మహారాజ్ ప్రకారం, దసరా ప్రతి సంవత్సరం ఆశ్వియుజ మాసంలోని శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం దశమి తిథి అక్టోబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. ఈసారి దసరా పండుగను 5 అక్టోబర్ 2022, బుధవారం రోజున జరుపుకుంటారు. శుభ సమయం గురించి మాట్లాడుతూ, అక్టోబర్ 5 మధ్యాహ్నం 2:14 నుండి 3:01 వరకు విజయ్ ముహూర్తం ఉంటుంది. పూజా సమయం 01:26 PM నుండి 03:48 PM వరకు ఉంటుంది.
Neelam Gemstone Benefit: నీలమణిని ఏ రాశి వారు ధరించాలి, నీల మణి రత్నం ఉంగరంలో ధరించిన తర్వాత చేయాల్సిన పని ఇదే..
ఈసారి శారదీయ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
హిందూమతంలో శారదీయ నవరాత్రులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షంలోని ప్రతిపద తిథి నుండి నవమి తిథి వరకు ఇవి నవరాత్రులు. ఈ సంవత్సరం, శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 26 నుండి కలశ స్థాపనతో ప్రారంభమవుతాయి, ఇందులో మాతా దుర్గ వివిధ రూపాలను పూజిస్తారు. అక్టోబరు 4న నవమి, 5న దశమి నాడు విజయదశమి జరుపుకుంటారు. దీపావళికి ముందు జరుపుకునే అతిపెద్ద పండుగలు నవరాత్రి, దసరా. నవరాత్రులలో పెద్ద సంఖ్యలో ప్రజలు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం పాటిస్తారు. ప్రార్థనలు చేస్తారు.