(Photo Credits: File Image)

శనివారం అనగానే మనకు ఆపదల మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు.మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదల నుండి గట్టెక్కించమని వేడుకుంటాం. మన జీవితంలో ఎక్కువగా శని నుండి విపరీతమైన బాధలను ఎదుర్కొంటాం.ఆయన ప్రభావం మన మీద పడకుండా ఉండాలన్నా మరియు ఆయన ప్రభావం తగ్గాలన్నా నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించాలి.

వెంకటేశ్వర స్వామి కృప మనపై ఉంటె మనకి ఎలాంటి దోషాలు రావు.శనిదోషం కూడా పోవాలంటే 8 శనివారాలు ఖచ్చితంగా ఒక వ్రతం  చేయాలి. మగవాళ్లు వరుసగా ఈ వ్రతం చేయాల్సి ఉంటుంది. కానీ  ఒకవేళ ఆడవాళ్ళు ఒక వేళ ఈ వ్రతం ఆచరించే సమయంలో  చేస్తే ఏమైనా అడ్డంకులు వస్తే ఆ వారం మినహాయించి, ఎక్కడ ఆపారో అక్కడ నుంచి లెక్క వేసుకుని చేయవచ్చు. ఎలా చేయాలో తెలుసుకుందాం.

శనివారం ఉదయాన్నే నిద్ర లేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామికి అలంకారం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా బియ్యంపిండిలో కాస్త పాలు పోసి,  ఒక చిన్న బెల్లం ముక్క, అరటి పండు ముక్క వేసి కలిపి చపాతి పిండిలాగా చేసి దానితోనే ప్రమిదలాగా చెయ్యాలి అంటే, బియ్యంపిండి ప్రమిద అన్నమాట. అయితే ఈ ప్రమిదలో 7 వొత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం  ముందు పెట్టి వెలిగించాలి. ఇలా 8 శనివారాలు వెంకటేశ్వరస్వామి పూజ చేస్తే దోషాలన్నీ పోయి, అనుకున్న పనులు జరుగుతాయి.