Suryagrahan 2022: 2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 30వ తేదీన శనివారం అర్థరాత్రి 12:15 గంటలకు(భారత సమయం ప్రకారం) తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం 4:07 గంటల వరకు ఉంటుది. అంటే ఇది పాక్షిక గ్రహణంగా మేషరాశిలో ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా.. సూర్య గ్రహణాన్ని కొందరు అశుభకరంగా భావిస్తారు. అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.
దేవాలయాలు కూడా పూర్తిగా మూసివేస్తారు. ఎందుకంటే గ్రహణం సమయంలో సూర్యుడి ప్రభావంతో శక్తిని కోల్పోతారని చాలా మంది నమ్ముతారు. ఇదే సమయంలో ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయట. కాబట్టి ఈ రాశుల వ్యక్తులు సూర్య గ్రహణం వేళ చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఈ గ్రహణం ముగిసిన తర్వాత కూడా దాదాపు రెండు వారాల వరకు అప్రమత్తంగా ఉండాలి. ఇంతకీ ఆ రాశుల వ్యక్తులు ఎవరనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
మేష రాశి..
ఇదే రాశిలో సూర్య గ్రహణం ఏర్పడే అవకాశం ఉన్నందున, మేష రాశి వారికి ఆకస్మికంగా ఆర్థిక పరమైన సమస్యలు పెరగొచ్చు. డబ్బు సమస్య పెరగడంతో మీ పనులన్నీ పెండింగులో పడొచ్చు. ఈ కాలంలో మీరు ముఖ్యమైన మరియు పెద్ద లావాదేవీలకు చాలా దూరంగా ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో మీ ప్రసంగాలను కూడా కంట్రోల్ లో ఉంచుకోవాలి. హనుమాన్ చాలీసా పఠిస్తే దోషాల నుంచి నివారణ అవుతుంది.
కన్య రాశి..
ఈ రాశి వారికి కూడా సూర్య గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే అది ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఎంత కష్టపడినప్పటికీ ఫలితం ఆశించినంత మేరకు రాకపోవచ్చు. ఉద్యోగులు ఈ కాలంలో ఉద్యోగం మారేందుకు సమయం సరైనది కాదు. కాబట్టి ఈ కాలంలో ఓపిక పట్టండి. హనుమాన్ చాలీసా పఠిస్తే దోషాల నుంచి నివారణ అవుతుంది.
తుల రాశి..
ఈ రాశి వారికి సూర్య గ్రహణం కారణంగా ఆరోగ్య పరంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. అలాగే వివాదాలు మరియు చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వీటన్నింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠిస్తే దోషాల నుంచి నివారణ అవుతుంది.
వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో అశుభ ఫలితాలొస్తాయి. ముఖ్యంగా ఉద్యోగులకు కెరీర్ పరమైన విషయాల్లో ప్రతికూలగా ఉంటుంది. వ్యాపారులు కూడా ఈ కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో చాలా ఓపికగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠిస్తే దోషాల నుంచి నివారణ అవుతుంది.
కుంభ రాశి..
సూర్యగ్రహణం సమయంలో ఈ రాశి వారి వ్యాపారులు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలంలో లావాదేవీలు చేయడం వాయిదా వేసుకోవాలి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. లేదంటే మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. హనుమాన్ చాలీసా పఠిస్తే దోషాల నుంచి నివారణ అవుతుంది.