Vinayaka Chavithi 2022 Greetings in Telugu

ప్రతి ఒక్కరి జీవితంలోనూ రుణం అనేది ఎంతో బాధించే విషయం ఒక్కసారి రుణ వలయంలో చిక్కుకున్నాము అంటే అందులోంచి బయటపడటం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి ఎంతో అకుంఠిత దీక్ష ఉంటే కానీ చేసిన అప్పుని మనం తీర్చుకోలేం. అప్పును అందుకే వలయం అని అంటారు ఇందులో చిక్కుకున్న వారు ఊబిలో చిక్కుకున్నట్టే అని పెద్దలు చెబుతుంటారు. అప్పుల వలయం నుంచి బయట పడాలంటే. మన పెద్దలు పండితులు చెప్పినటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిని నిత్యం పాటించడం ద్వారా మీరు రుణబంధం నుంచి విముక్తులయ్యే అవకాశం ఉంది. అలాంటి రుణ విముక్త గణేశ కవచ మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గణేశ కవచ మంత్రం చదివితే రుణ విముక్తులు అవడం ఖాయం..

ఏషోతి చపలో దైత్యాన్ బాల్యేపి నాశయత్యహో |

అగ్రే కిం కర్మ కర్తేతి న జానే మునిసత్తమ ||

దైత్యా నానావిధా దుష్టాస్సాధు దేవద్రుమః ఖలాః |

అతోస్య కంఠే కించిత్త్యం రక్షాం సంబద్ధుమర్హసి ||

ధ్యాయేత్ సింహగతం వినాయకమముం దిగ్బాహు మాద్యే యుగే

త్రేతాయాం తు మయూర వాహనమముం షడ్బాహుకం సిద్ధిదమ్ |

ఈ ద్వాపరేతు గజాననం యుగభుజం రక్తాంగరాగం విభుమ్ తుర్యే

తు ద్విభుజం సితాంగరుచిరం సర్వార్థదం సర్వదా ||

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,

ఈ మంత్రం ప్రతి బుధవారం ఉదయం లేవగానే తల స్నానం చేసి గణేషుడి పటం ఎదురుగుండా ఒక దీపం వెలిగించి భక్తి కొద్ది ఈ మంత్రాన్ని ఐదుసార్లు పాటిస్తే చాలు మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మీరు రుణ విముక్తుల అయ్యే అవకాశం ఉంది. ఈ మంత్రాన్ని ప్రతి బుధవారం పాటించాల్సి ఉంటుంది. అలా వరుసగా 21 బుధవారాలు చేసినట్లయితే మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.