తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి నిలువుటద్దం, తెలంగాణ ఆడపడుచుల పూల పండుగ, ప్రకృతిని ఆరాధిస్తూ... పూలను పూజిస్తూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ బతుకమ్మ.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. ప్రకృతిని ఆరాధిస్తూ పూలను పూజించే తెలంగాణ పండుగ బతుకమ్మ. ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక.
తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి బతుకమ్మను అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. ఆశ్వయుజ అమావాస్యనాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిది రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మగా సాగనంపడంతో ముగుస్తాయి
మన తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ.. బతుకమ్మ పండుగ ప్రారంభం (ఎంగిలిపూల బతుకమ్మ) సందర్భంగా ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.
పువ్వులను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ... పండగ, మన సంస్కృతి.. మన సాంప్రదాయానికి ప్రతీక... ఆడపడుచుల ఔన్నత్యానికి సూచిక.. తెలంగాణ ఆడపడుచులందరికీ... ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..