హోలీ పండుగను వసంత ఋతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది చలికాలం తొలగి పోయి ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్థావన వంటిది. హోలీ పండుగను సాధారణంగా “ఫాల్గుణి పూర్ణిమ” నాడు జరుపుకుంటారు. ఇలా ఒక రుతువు వెళ్లి మరో రుతువు వచ్చే సమయంలో ముఖ్యంగా శీతాకాలం ‘చలి’ వెళ్లిపోయి ఎండాకాలం ‘వేడి’ వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడావల్ల చర్మం చిట్లుతుంది. రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయి. హోలీ శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్ కోట్స్ మీకోసం

హోలీ పండుగ మీ అందరి జీవితాలను రంగులమయం చేయాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు.

హోలీ కేవలం పిడకలు, కర్ర కుప్పలను మాత్రమే కాల్చే పండుగ కాదు,చిత్తం యొక్క బలహీనతను దూరంచేసుకోవడానికి మరియు మనసులోని మలినమైన వాసనలను కాల్చడానికి ఇది పవిత్రమైన రోజు.

మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండగ శుభాకాంక్షలు

రంగులన్నీ కలబోసిన హోళీ పండుగ అందరి జీవితాల్లో రంగులు నింపాలని,తెలుగు ప్రజల ఇళ్లల్లో సంతోషం వెల్లివిరియాలని కోరుకుంటూ పజలందరికి హోలీ పండగ శుభాకాంక్షలు..

వసంత ఋతువులో వొచ్చే తొలివేడుక హోలీ చిన్న పెద్ద తేడాలేకుండ ఉత్సహంగా, సంతోషంగా జరుపుకునే హోలీ పండగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ... అందరికి హోలీ పండగ శుభాకాంక్షలు