Horoscope Today, 25 April 2022: సోమవారం ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది, ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, మరి మీ రాశి ఉందేమో చూసుకోండి.
(Photo Credits: Flickr)

Horoscope Today, 25 April 2022: కొన్ని రాశుల వారికి సోమవారం చాలా మంచి రోజు. సోమవారం నాడు వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. మరోవైపు, కుంభరాశి ప్రజల మంచి పనిని చూసి, వారి యజమాని వారికి కొన్ని పెద్ద బాధ్యతలను అప్పగించవచ్చు, ఇది వారి ప్రత్యేక సామర్థ్యాలను చూపించడానికి వారికి అవకాశం ఇస్తుంది. 

మేషం

బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది.

వృషభం

ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు నూతన వ్యాపారాలు పారంభించకపోవడం మంచిది ఉద్యోగాలలో శ్రమ అధికమౌతుంది.

మిధునం

పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పుణ్య క్షేత్ర సందర్శనం చేసుకుంటారు. స్థిరాస్తి విషయమై ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగులు మరింత కష్టపడక తప్పదు.

Lakhimpur Kheri Violence Case: లఖింపూర్ హింసాత్మక ఘటన కేసుపై సుప్రీం కీలక ఆదేశం, మాజీ జడ్జి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరగాలని యూపీ సర్కారుకు స్పష్టం, అంగీకరించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

కర్కాటకం

వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. వ్యాపార పరంగా కొన్ని నిర్ణయాలు కలసి వస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తులతో వివాదాలు తీరతాయి.

సింహం

నూతన పరిచయాలు వలన విలువైన విషయాలు తెలుసుకొంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగ సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారపరంగా ఉత్సాహ వాతావరణం ఉంటుంది.

కన్య

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దాయాదుల తో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

తుల

మిత్రుల వలన సమస్యలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. శిరో బాధలు అధికమౌతాయి. సంతాన ఆరోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగ విషయమై వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చికం

దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఋణ ప్రయత్నాలు కలిసొస్తాయి.కుటుంబ సభ్యుల సహాయం లబిస్తుంది. పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ధనస్సు

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకరం

స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. గృహమున శుభకార్య పనులు వేగంగా పూర్తవుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగమున మరింత పురోగతి కలుగుతుంది.

కుంభం

అవసరం కానీ వస్తువులకు ధన వ్యయం అవుతుంది ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. ఋణ దాతల ఒత్తిడి అధికమౌతుంది. కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.

మీనం

కుటుంబ సభ్యుల మధ్య వివాహ ప్రస్తావన వస్తుంది వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులకు ప్రశంసలు పొందుతారు కొత్తవ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ పరంగా ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.