New Delhi, November 15: లఖింపూర్ హింసాత్మక ఘటన కేసుపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందంలో (సిట్) సీనియర్ అధికారుల్ని పెంచి మరింత విస్తృతపర్చమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఈ విషయమై విచారణ చేపట్టిన సీజేఐ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం అంతే కాకుండా ఈ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఒక జడ్జిని నియమించాలని సూచించింది. లఖింపూర్ ఖేరీ కేసు ఘటనపై (Lakhimpur Kheri Violence Case) సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ఘటనపై దర్యాప్తును హైకోర్టు రిటైర్డ్ జడ్జి (Can Consider Appointing Retired SC Judge) నేతృత్వంలోని జరిపేందుకు యూపీ సర్కారు గీకరించింది. దీంతో ఈ కేసు దర్యాప్తుపై ఆదేశాలను బుధవారం జారీ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. సిట్ బృందంలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు చోటు కల్పించాలని, వారి పేర్లను మంగళవారంలోగా యూపీ ప్రభుత్వం సిఫారసు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.
ధర్మాసనం ఏ హైకోర్టుకు (అలహాబాద్ హైకోర్టుతో సహా) చెందిన రిటైర్డ్ జడ్జినైనా కేసు విచారణ కోసం నియమించవచ్చని తెలిపారు. ఇంతకు ముందు సుప్రీం కోర్టు.. హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంజాబ్-హర్యానా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రాకేశ్‌కుమార్ జైన్, రంజిత్ సింగ్ పేర్లను సిఫారసు చేసింది. కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులను కూడా సిట్‌లో చేర్చాలని ఆదేశించింది. ఇంతకు ముందు జరిగిన విచారణలో ఘటనకు సంబంధించిన సాక్షులకు భద్రత కల్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే హింసాకాండలో జర్నలిస్ట్ రమణ్ కశ్యప్, శ్యామ్ సుందర్ హత్య కేసు దర్యాప్తుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
అయితే పంజాబ్-హర్యానా హైకోర్టు జడ్జీ రాకేష్ కుమార్ జైన్‌ను నియమించేందుకు కోర్టు సముఖంగా ఉందని, వారిని సంప్రదించిన అనంతరం ఈ విషయాన్ని స్పష్టం చేస్తామని Supreme Court పేర్కొంది. అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి అనే జిల్లాలో మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులపై నుంచి కేంద్ర మంత్రి ఆజయ్ మిశ్రా కాన్వాయ్ వెళ్లి నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారు.