Horoscope Today 9 June 2022, Astrology: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ రాశి వారు ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఫలితం వెంటనే చెక్ చేసుకోండి..
(Photo Credits: Flickr)

మేషం :  ప్ర‌య‌త్న‌కార్యాల‌న్నింటిలో విజ‌యం పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత స‌న్నిహితుల‌ను క‌లుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

వృష‌భం : రుణ ప్ర‌య‌త్నాలు ఫ‌లించును. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క మాన‌సికాందోళ‌న చెందుతారు. స్త్రీల‌కు స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుండును. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది.

మిథునం : కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం క‌లిగే అవ‌కాశ‌ముంది. వృధా ప్ర‌యాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రుల‌తో క‌ల‌హించుకోకుండా జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స‌హ‌నం వ‌హించ‌క త‌ప్ప‌దు.

క‌ర్కాట‌కం : కుటుంబ విష‌యాల‌పై అనాస‌క్తితో ఉంటారు. గృహంలో మార్పులు జ‌రిగే అవ‌కాశాలున్నాయి. త‌ల‌చిన కార్యాలు ఆల‌స్యంగా నెర‌వేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేప‌టికి వాయిదా వేసుకుంటారు. స్త్రీల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది.

సింహం : ఇత‌రుల‌చే గౌర‌వింప‌బ‌డే ప్ర‌య‌త్నంలో స‌ఫ‌ల‌మ‌వుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా లేనందున మాన‌సికాందోళ‌న చెందుతారు. ప్ర‌తి ప‌ని ఆల‌స్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Astrology: ఈ మూడు రాశులకు వినాయకుడి కృపతో అదృష్టం వరిస్తుంది, మీ రాశి కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి..

క‌న్య : మాన‌సికాందోళ‌న తొల‌గుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్ర‌త్త వ‌హించాలి. ఆక‌స్మిక భ‌యం దూర‌మ‌వుతుంది. ప్ర‌యాణాల్లో మెల‌కువ అవ‌స‌రం. ప్ర‌య‌త్న‌కార్యాల్లో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఆల‌స్యంగా ఫ‌లిస్తాయి.

తుల : ఆక‌స్మిక ధ‌న‌లాభ‌ముంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు. ఇత‌రుల‌కు ఉప‌కారం చేయుట‌కు వెనుకాడ‌రు. రుణ బాధ‌లు తొల‌గిపోతాయి. శ‌త్రు బాధ‌లుండ‌వు.

వృశ్చికం : అనారోగ్య బాధ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లుంటాయి. నూత‌న వ్య‌క్తులు క‌లుస్తారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండక మాన‌సికాందోళ‌న చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూర‌మ‌వుతాయి.

ధ‌నుస్సు : విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భ‌మ‌వుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌రాదు. ఆక‌స్మిక ధ‌న న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశ‌ముంది. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం గూర్చి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం.

మ‌క‌రం : గొప్ప‌వారి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. స్త్రీల మూల‌కంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచ‌న‌ల‌ను క‌లిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌర‌విస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. స‌త్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవ‌స‌రాల‌కు ప్రాధాన్య‌మిస్తారు.

కుంభం : కుటుంబంలో చిన్న చిన్న గొడ‌వ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప‌రిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. ఆర్థిక ఇబ్బందుల‌ను అధిగ‌మించుట‌కు రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు. బంధు, మిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ఆల‌స్యంగా ల‌భిస్తాయి.

మీనం : వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆల‌స్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం క‌లిగే అవ‌కాశాలుంటాయి. ఏ విష‌యంలోనూ స్థిర నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. అనుకోని ఆప‌ద‌ల్లో చిక్కుకోకుండా గౌర‌వ‌, మ‌ర్యాద‌ల‌కు భంగం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.