ఎవరు ఎన్ని చెప్పినా, ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు మాత్రమే అనేది అసలైన సత్యం, మనకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, డబ్బు ఉండటం వల్ల ఆ కష్టాలను ఆర్థిక వ్యవస్థ ద్వారా గట్టెక్కే అవకాశం ఉంటుంది. కొన్ని విలువైన బంధాలను డబ్బుతో కొనుగోలు చేయలేము, కానీ డబ్బు వల్ల అనేక అవసరాలు తీరుతుంటాయి. అందుకే మన జీవితంలో ఎక్కువ భాగం డబ్బు సంపాదన కోసమే కష్టపడుతుంటాము. కొంత మంది జీవితంలో ఎంత కష్టపడినప్పటికీ కష్టాలు కొండంతగా మారి మీ డబ్బును నిలువ చేయనివ్వవు. అందుకే హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం లక్ష్మీ దేవి కటాక్షంతో ధనప్రాప్తి దక్కుతుందనేది భక్తుల విశ్వాసం.
పురాతన గ్రంధాలలో లక్ష్మీ దేవికి అత్యంత ప్రీతిపాత్రమైన శుక్రవారం ఏమేం చేయాలో చెప్పబడ్డాయి. ఇలా చేయడం వల్ల వారి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. శుక్రవారం లక్ష్మి దేవికి అంకితం చేయబడింది, ఈ రోజున లక్ష్మీ దేవిని పూర్తి ఆచారాలతో పూజించడం ద్వారా ఆమె సంతోషిస్తుంది. తన భక్తుల ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగిస్తుంది. ఒక వ్యక్తిని డబ్బుకు సంబంధించిన సమస్యలు చుట్టుముట్టినట్లయితే, అటువంటి వ్యక్తి శుక్రవారం నాడు మహాలక్ష్మి దేవిని నిష్టతో పూజించాలని పండిలు సూచిస్తున్నారు. మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలంటే శుక్రవారం ఏం చేయాలో తెలుసుకుందాం.
>> శుక్రవారం తెల్లవారుజామున స్నానం చేసిన తర్వాత, ముగ్గురు ముత్తైదువలను ఇంటికి ఆహ్వానించి వారికి పాయసం తినిపించాలి. అదే సమయంలో, వారికి శక్తి కొలది పసుపు, బట్టలు, దక్షిణ ఇచ్చి పంపాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని నమ్ముతారు.
>>శుక్రవారం నల్ల చీమలకు పంచదార తినిపించడం ద్వారా నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయని నమ్ముతారు. ఒక వ్యక్తి ఏదైనా పని చాలా కాలం పాటు నిలిచిపోయినట్లయితే, 11 శుక్రవారాలు నల్ల చీమలకు పంచదార ధాన్యాలు పెట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
>> శుక్రవారం నాడు, లక్ష్మీ దేవి పూజలో తల్లికి కమలం లేదా గులాబీ పువ్వును సమర్పిస్తే. అలాంటి వ్యక్తి ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటుంది. పురోగతికి అవకాశాలు కూడా ప్రారంభమవుతాయి.
>> శుక్రవారం ఎర్రటి గుడ్డలో ఒకటిన్నర కిలోల బియ్యాన్ని ఉంచి మూటగట్టి, , 'ఓం శ్రీం శ్రీయే నమః' అనే మంత్రాన్ని జపించి, ఆపై ఈ మూటను మీ డబ్బు దాచే గల్లా పెట్టే సమీపంలో కానీ అల్మారాలో కానీ, సేఫ్టీ లాకర్ లో లేదా భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీనితో పాటు, డబ్బు సంపాదించే అవకాశాలు కూడా పెరుగుతాయి.