Friday Lakshmi Pooja: శుక్రవారం ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నారా, అయితే ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి, చేస్తే మాత్రం లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు..
Rep. Image (Source: Quora)

శుక్రవారం.. ఈ వారానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీ మహాలక్ష్మికి ప్రీతి కరంగా భావించే ఈ రోజు ఎంతో ప్రసిద్ధి చెందింది. శుక్రవారం ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వారంగా చెబుతుంటారు. అటువంటి ఈ పర్వ దినాన చేయాల్సిన పనులు, అదేవిధంగా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి తెలుసుకొని పాటిస్తే జీవితం సంతోషమే అవుతుందని వేద పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మన జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగిపోయి... ఐశ్వర్యం కలిసి రావాలంటే శుక్రవారం నాడు అమ్మవారి సాధన బాగా చేయాలి. ఎంతో శ్రద్ధతో భక్తితో పూజలు చేయాలి... వీలైతే గుడికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవాలి.

శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తల స్నానం చేసి.... తులసి చెట్టుకు పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి. తెల్లవారు జామునే లేచి... మొట్టమొదట అమ్మవారి విగ్రహాన్ని నమస్కరించుకున్న తరువాతే మిగిలిన పనులను మొదలు పెట్టాలి. అదే విధంగా ఇంటి గడపకు పసుపు మరియు కుంకుమలతో అలంకరణ చేయాలి. అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మం ని చూసి ఇంటిలోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

శుక్రవారం నాడు... ఇంట్లో ఎటువంటి కలతలు ఉండకుండా చూడాలి. ప్రధానంగా స్త్రీలు కంట తడి పెట్టకూడదు. ఇది చాలా అదృష్టం. ఈరోజు స్త్రీలందరూ శ్రీ మహాలక్ష్మి లా సంతోషంగా కలకల లాడుతూ ఉండాలి.. శుక్రవారం నాడు అప్పు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదు. శుక్రవారం రోజు ఈశాన్య మూలలో చీపురును ఉంచరాదు.

UK PM Boris Johnson India Visit: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ చేరుకున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, భారత్‌- బ్రిటన్‌ వాణిజ్య, ప్రజా సంబంధాలపై కీలక చర్చలు జరిగే అవకాశం

వీలైతే ఈరోజు పూజలో ఆవు నేతితో దీపం పెట్టడం శ్రేయస్కరం. శుక్రవారం నాడు పాత బట్టలు ఎవ్వరికీ ఇవ్వకూడదు అలాగే ధాన్యాన్ని కూడా ఇవ్వకూడదు. ఇలా శుక్రవారం నాడు చేయాల్సిన కార్యక్రమాలను  మరియు చేయకూడని  కార్యక్రమాలను తెలుసుకున్నాము కదా, అవి పాటించి సంతోషంగా భోగ భాగ్యాలతో  ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం.