Christmas 2021: క్రిస్మస్ పర్వదినాన ఈ దేశాల్లో పాటించే వింత ఆచారాలు తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు...
Merry Christmas | (Photo Credits: Pixabay)

క్రిస్మస్ పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని క్రైస్తవులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌కు సంబంధించి వివిధ ఆచారాలు ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాం. వీటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. క్రిస్మస్ కు సంబంధించిన విచిత్రమైన ,సంప్రదాయాలను తెలుసుకుందాం.

ఆస్ట్రియా

ఆస్ట్రియాలోని సెయింట్ నికోలస్‌కి క్రాంపస్ అనే దుష్టుడు ఉన్నాడు. అతను సెయింట్ నిక్ అనే సన్యాసి మంచి స్వభావానికి భిన్నంగా రాక్షసుడుగా ఉండేవాడు. క్రాంపస్ రాక్షసుడు లాంటివాడు, అతడు క్రిస్మస్ ముందు పిల్లలను ఎత్తుకెళ్లేవాడు అని నమ్మేవారు. దీంతో పండుగ రోజు పిల్లలను వీధుల్లోకి రాకుండా క్రాంపస్ పేరు చెప్పి భయపెట్టడం ఆచారంగా మారింది.

స్పెయిన్

కాటలోనియా, స్పెయిన్‌తో సహా అనేక ప్రాంతాలలో ఒక ప్రత్యేక ఆచారం ఉంది, ఒక చెక్క మొద్దుకు సగం దుప్పటితో కప్పి దానికి కళ్ళు, ముక్కు , ముఖం బయటి భాగంలో చెక్కుతారు. క్రిస్మస్ సాయంత్రం, ఆ చెక్క ముద్దను పిల్లలు దాన్ని కర్రతో కొడతారు. దీని తరువాత, దుప్పటిని తీసివేసిన తర్వాత, ప్రతి ఒక్కరూ తమ బహుమతులను పంచుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బహుమతులను దుప్పట్లలో దాచిపెడతారని నమ్ముతారు.

ఉక్రెయిన్

ఉక్రెయిన్‌లో క్రిస్మస్ రోజు ఇంటిని సాలెపురుగుల బొమ్మలతో  అలంకరణలతో అలంకరించే సంప్రదాయం కూడా ఉంది. ఇక్కడ, పాత జానపద కథ ప్రకారం, ఒక పేద వితంతువు తన పిల్లల కోసం క్రిస్మస్ చెట్టును అలంకరించడానికి డబ్బు లేదు. అటువంటి పరిస్థితిలో, ఇంట్లోని సాలెపురుగులు కుటుంబంపై జాలిపడి చెట్టుపై అందమైన సాలెగూడును అల్లాయి. పిల్లలు క్రిస్మస్ ఉదయం చూసి సంతోషించారు. ఉక్రేనియన్ సంస్కృతిలో స్పైడర్ వెబ్‌లను కూడా అదృష్టమని భావిస్తారు.

పోర్చుగల్

పోర్చుగల్‌లో, ప్రజలు క్రిస్మస్ సందర్భంగా ఆహారాన్ని తినేటప్పుడు అనేక అదనపు ప్లేట్‌లలో ఆహారాన్ని కూడా ఉంచుతారు. ఈ రోజున చనిపోయిన వారి ప్రియమైనవారు కూడా తమతో కలిసి భోజనం చేస్తారని వారు నమ్ముతారు. ఈ సంప్రదాయం విచిత్రంగా ఉంటుంది.

చెక్ రిపబ్లిక్

క్రిస్మస్ రోజు పెళ్లికాని స్త్రీలు డోర్ ముందు భుజాలపై ఒక బూటును పెట్టుకొని ఒంగుతారు, అప్పుడు ఆ బూటు పాదాల మీద పడితే.. ఏడాదిలోపే పెళ్లి అవుతుందని భావిస్తారు. డోర్ బయట పడితే పెళ్లికి మరో ఏడాది ఆగాల్సిందే.

నార్వే

నార్వేలో క్రిస్మస్ పండుగ రోజు దెయ్యాల మాంత్రికులు తమ ఎరను కనుగొనడానికి తమ మంత్ర చీపురులపై ఎగురుతారని నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటి చీపురును పూర్తిగా దాచి ఉంచుతారు. ఈ రోజున మంత్రగత్తె చీపురు కనిపించే ఇంట్లో తన శిబిరాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్ముతారు.

స్పెయిన్

స్పెయిన్‌లోని ఒక నగరంలో, క్రిస్మస్ రోజున ఎరుపు రంగు షార్ట్స్ మాత్రమే ధరించాలని నమ్ముతారు. ఈ సంప్రదాయాన్ని మరో అడుగు ముందుకు వేస్తూ, క్రిస్మస్ సందర్భంగా అక్కడి ప్రజలు ఎరుపు రంగు పొట్టి దుస్తులు ధరించి పరుగులు తీస్తారు.