
తన కుటుంబం కోసమే కాకుండా నేటి మహిళ సమాజం, దేశం కోసం కూడా తన శక్తి సామర్థ్యాలను పంచుతోంది. మహిళా సాధికారత దేశానికి, సంస్కృతికి గర్వకారణం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రంగాలలో పురోగమిస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు.
ఆమె తల్లిగా లాలిస్తుంది. చెల్లిగా తోడుంటుంది. భార్యగా బాగోగులు చూస్తుంది. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తుంది. సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళలకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే.
నేటి సమాజంలో స్త్రీ పాత్ర వెలకట్టలేనిది. పుట్టుక దగ్గర నుంచి మరణం వరకూ ఆమె చేపట్టలేని బాధ్యత అంటూ ఏదీ లేదు.పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతూ మహిళా శక్తిని చాటి చెపుతున్నారు.ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళా మూర్తులందరికీ శుభాకాంక్షలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా: క్రియా:'' ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు. మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు


ఈ లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు.
స్త్రీ లేకపోతే గమనం లేదు.
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు.
స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. మనల్ని కంటిపాపలా కాపాడే స్త్రీమూర్తిని స్మరించుకోవడం మన అందరి బాధ్యత. మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

ఆది పరాశక్తులు,శాంతమూర్తులు,త్యాగానికి మరోరూపుం అయిన సోదరీమణులందరికీ "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" శుభాకాంక్షలు

ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు...