Narasihma Jayanti: మే 14 న నరసింహ జయంతి, ఉపవాసంతో పాటు ఈ వ్రతం, మంత్రాలు చదివితే, సకల పీడలు తొలగి, లక్ష్మీ నరసింహ స్వామి మీ ఇంటిని కాపాడుతాడు..
Sri Lakshmi Narasimha Swamy (Image: Twitter)

నరసింహ భగవానుడు విష్ణువు యొక్క ఆరవ అవతారంగా భావిస్తారు. భక్తులను కాపాడటం కోసం అవతరించిన నర్సింహా స్వామి జయంతి ఈ ఏడాది మే 14న జరగనుంది. నరసింహ భగవానుడు వైశాఖ శుక్ల పక్ష చతుర్దశి రోజున అవతరించాడు. ఈ సంవత్సరం చతుర్దశి నాడు రవియోగం, స్వాతి నక్షత్రం కలిసి రావడం వల్ల మే 14న సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతోంది. ఈ సమయంలో నరసింహ స్వామిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.

నరసింహ జయంతి పూజ ముహూర్తం

నరసింహ జయంతి వ్రత పూజ సంకల్పం శుభ సమయం: మే 14 ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 01:40 వరకు

నరసింహ జయంతి సాయంత్రం పూజ సమయాలు: సాయంత్రం 04:22 నుండి 07:05 వరకు

నరసింహ జయంతి ఎందుకు జరుపుకుంటారు..

నరసింహ స్వామి ఎంతో శక్తివంతమైన భగవంతుడు. ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నరసింహ జయంతిని వేడుకగా జరుపుకొంటారు. నరసింహను విష్ణువు మరియు అతని ఇతర అవతారాల మాదిరిగానే పూజిస్తారు.

నరసింహ జయంతి ప్రాముఖ్యత

నరసింహ జయంతిని విష్ణు ఆరాధకులకు చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం, నరసింహుడు అసుర రాజు హిరణ్య కశిపుడనే రాక్షసరాజును సత్యాగ్రహంలో చంపినట్లు కనిపించాడు మరియు అతని గొప్ప భక్తుడు భక్త ప్రహ్లాదను రక్షించి ధర్మాన్ని పునరుద్ధరించాడు.

పూజ విధానం

ఈ రోజు ఉదయం ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత, సాయంత్రం 04:22 నుండి 07:05 వరకు సమయంలో స్వామి వారికి పూజ చేయాలి. ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. మనం భగవంతుడికి పండ్లు, పూలు, దక్షిణ తాంబూలాలను భక్తి తో సమర్పించుకోవాలి.

నృసింహస్వామికి ఎరుపురంగంటే ఇష్టం. అందుకే ఎరుప రంగు బట్టలను ధరించి, కుంకుమతో చేసిన అక్షతలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. తులసిమాలలతో ఆయనను అలంకరించి, వడపప్పు పానకాలను నివేదిస్తే ఆ స్వామి ఆశీస్సు దక్కి తీరుతుంది. ఇక ఈ రోజున లక్ష్మీనరసింహకరావలంబ స్తోత్రం, నరసింహ అష్టోత్తరం, నరసింహాష్టకం, నరసింహ సహస్రనామాలను పఠిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది.

- నృసింహ జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా ‘ఓం నమో నారసింహాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు పెద్దలు.

- ‘నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్‌’ అంటూ నృసింహ గాయత్రిని జపిస్తూ ఉన్నా ఎటువంటి అనారోగ్యం, ఆపదల నుంచైనా విముక్తి లభిస్తుందట.

- ‘ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌

నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం’ అనే మంత్రాన్ని పఠించినా మృత్యువు సైతం ఆమడదూరంలో నిలిచిపోతుందని నమ్మకం.

నరసింహ పూజ వల్ల కలిగే ప్రయోజనాలు

>> కోర్టు కేసులు మరియు చట్టపరమైన విషయాలలో విజయం

>> వ్యాధుల నుండి రక్షణ

>> అప్పులు, ఆర్థిక సమస్యలు మరియు కుటుంబ సమస్యలతో వ్యవహరించడం

>> మానసిక అనారోగ్యం నుండి రక్షణ, మరణం మరియు పీడకలల భయం నుండి విడుదల

>> శత్రువుల నుండి రక్షణ