Chandra Grahan 2022: నవంబర్ 8న చంద్రగ్రహణం, ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో కింద పేర్కొన్న మూడు రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.  ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.  ఏ పూజ చేయాలో తెలుసుకోండి

మేష రాశి : చంద్రుడిప్రభావం మేష రాశిపై పడుతుంది. దీని వల్ల ఆ రాశి వారికి నేరుగా నష్టం జరగకపోయినా వారి పిల్లలపై దీని ఎఫెక్ట్​ అధికంగా ఉంటుంది. పిల్లల చదువు మందగించడంతోపాటు చెడు అలవాట్లకు లోనయ్యే ప్రమాదం ఉందట. ఈ సమయంలో మేష రాశి వారు ఆందోళన చెందకుండా పిల్లలపై చదువులపై శ్రద్ధ పెట్టాలి. వారిని ప్రోత్సహిస్తూ ఎడ్యుకేషన్​పై దృష్టి సారించేలా చూడాలి. 11 రోజుల పాటు హనుమాన్ చాలీసా చదవితే ఏ ప్రమాదం ఉండదు.

తుల రాశి : చంద్రుడి గ్రహణం వల్ల ఈ రాశి వారికి ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన చోట్ల అధికంగా ధనం వృథా అవుతుంది. దీని కారణంగా ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. ఆఫీసులో జాగ్రత్త వహించండి. కోర్టు వివాదాలు వచ్చే అవకాశం ఉంది. గణపతిని పూజించండి, మీ రాశిపై ఉన్న దృష్టి పోతుంది.

అత్యాచార బాధితురాలిపై టూ ఫింగర్‌ టెస్ట్‌‌పై మండిపడిన సుప్రీంకోర్టు, తక్షణమే ఈ విధానం నిలిపివేసేలా చూడాలని కేంద్రానికి ఆదేశాలు

కుంభ రాశి : ఈ రాశి వారి ఆరోగ్యంపై చంద్రగ్రహణంప్రభావం చూపుతుందట. తరచూ అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, డ్రైవింగ్​ చేసే సమయంలో.. రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. హనుమంతుడు ఆరోగ్యప్రదాత కావునా 11 మంగళవారాలు ఆంజనేయుడి గుడికి వెళ్లి కొబ్బరి కాయ కొట్టండి.