Image Source : QUORA

బలశాలి అయిన భగవంతుడు హనుమంతుడిని ప్రతీ మంగళవారం భక్తులు పూజిస్తుంటారు. అయితే, ఆంజనేయుడికి భక్తులు వడమాలలు వేస్తుండటం మనం చూడొచ్చు. ఇంతకీ ఎందుకలా వడమాలలు వేస్తారు.? పండితులు ఏం చెప్తున్నారు ? వడమాలలు వేయడం వలన కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

పెద్దలు ఆంజనేయుడి గురించి రకరకాల కథలు చెప్తుండటం మనం వినే ఉంటాం. ఆ కథల ప్రకారం.. ఆంజనేయుడు ఒక రోజు కొండ అనుకుని సూర్యుడిని మింగాడట. అలా మింగడం వలన గ్రహణం వచ్చేస్తుంది. అది ఎవరి పని అని అప్పుడు రాహువు ఆరా తీస్తాడు. అది హనుమంతుడి పని అని తెలుసుకుని హనుమంతుడితో ఇలా అంటాడు. తన పనిని కూడా నువ్వే చేశావు కాబట్టి ఇక నుంచి నిన్ను ఆరాధిస్తే రాహువు దోశాలు అన్ని పోతాయని వరమిచ్చేస్తాడు. అలా రాహువు ఇచ్చిన వరాన్ని హనుమంతుడు స్వీకరిస్తాడు.

ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్ష, రైతుల ప‌క్షాన కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తామని తెలిపిన రాకేశ్ తికాయ‌త్, దీక్ష వేదిక‌గా టీఆర్ఎస్ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌

ఈ క్రమంలోనే హనుమంతుడిని పూజించడం ద్వారా రాహువు దోశాలు అన్ని కూడా పోతాయి. అలా రాహువు బాధలు ఉన్న వారు హనుమంతుడిని పూజించడం ద్వారా పలు ప్రయోజనాలను పొందవచ్చును. ఇకపోతే సాధారణంగా అందరూ వడల తయారీకి మినుములు ఉపయోగిస్తుంటారు. గ్యారెలు కూడా మినుములతో చేస్తుంటారు.

మినుములు అంటే రాహువుకు అత్యంత ప్రీతి. కాగా, అలా రాహువుకు ప్రీతి పాత్రమైన వస్తువు చేత తయారు చేసిన వడలను మాలగా హనుమంతుడికి వేయడం ద్వారా దోశాలు తొలగిపోతాయని అర్చకులు చెప్తున్నారు. ఇకపోతే వడలు గుండ్రంగా ఉంటాయి. అలా సూర్య కిరణాలు రేఖా మాత్రం చేయడం కోసం ఉపయోగపడాతయని పెద్దలు వివరిస్తున్నారు.

ఆంజనేయుడికి ఇలా వడమాలతో పూజలు చేయడం ద్వారా రాహువు దోశాలు అన్ని కూడా పోయి మంచి జరుగుతుంది. ఇకపోతే మనం మినుములతో గ్యారెలు, వడలు చేయడం కామన్. కాగా, ఇతర రాష్ట్రాల్లో భక్తులు జాంగ్రీలు చేస్తుంటారు. జాంగ్రీలు కూడా మినుము పప్పుతో చేస్తారు. కానీ, వాటిని చేయడం కొంచెం కష్టం. ఇతర రాష్ట్రాల్లో ఆంజనేయ స్వామికి భక్తులు జాంగ్రీలతో పూజలు చేస్తుంటారు. అలా వారికి మంచి జరుగుతుంది. రాహువు దోశాలన్నీ కూడా పోయి వారికి చాలా మంచి జరుగుతుంది.