టాలీవుడ్‌లో సినిమాలతో పాటు కుటుంబాలు, బాంధవ్యాలకు బాగా విలువిచ్చేవారిలో మెగా ఫ్యామిలీ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఏ పండుగ అయినా కూడా అందరూ ఒకే చోటకు చేరుతుంటారు. ఇక మరీ ముఖ్యంగా సంక్రాంతి, దీపావళి పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సారి మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒకే చోటకు చేరి ఆడిపాడాయి.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండగైన సంక్రాంతి కోసం మెగా బ్రదర్స్ కుటుంబాలు ఒకే చోట చేరాయి. చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం, అలాగే అల్లు అరవింద్ కలిసి వేడుకలు జరుపుకున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చిరంజీవి, వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ అవి కాస్తా వైరల్‌గా మారాయి. మెగా ఫ్యామిలీ మాత్రమే సంక్రాంతిని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. భోగి మంటలు పెట్టుకుని అందరూ సరదాగ గడిపినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా చిరంజీవి ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో అందరూ కలిసి భోగి మంటలు వేసుకొని భోగి శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి సందడి చేశారు.
అందరికీ భోగ భాగ్యాల సంక్రాంతి శుభాకాంక్షలు !#HappyBhogi #HappySankranti pic.twitter.com/Qk9z2zU1Pv
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 14, 2022
అయితే ఈ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన జరిగింది. మామూలుగా అయితే దోశలు వేయడంలో చిరు స్పెషల్. అందులో మాస్టార్ ఎగరేసుకుంటూ మరీ దోశలు తిప్పేస్తారు. అలా చేయితిరిగిన వంటగాడిలా చిరు దోశలు వేస్తాడు.
ఇక సంక్రాంతి స్పెషల్‌గా ఇంట్లో అందరూ ఉండటంతో.. దోశల పెనం ఆరుబయట పెట్టి మరీ దోశలు వేశారు. ప్రతీసారి ఇలానే చేస్తుంటారు. దోశలు వేయడంలో వరుణ్ తేజ్ కూడా కాస్త సాయ పడ్డాడు.ఈ విషయాన్ని చెబుతూ ఓ వీడియోను షేర్ చేశాడు వరుణ్ తేజ్. ఇందులో అసలు విషయం బయటపడింది. చిరు వేసిన దోశ సరిగ్గా రాలేదు. వరుణ్ తేజ్ వేసిన దోశ చాలా బాగా వచ్చింది. దీంతో వాడిది బాగా వచ్చింది.. నాది రాలేదు.. నాకు కుళ్లొచ్చింది.. అందుకే ఇలా చేశాడు.. ఇది దోశ కాదు ఉప్మా అని వరుణ్ తేజ్ మీద సెటైర్ వేశాడు.
View this post on Instagram
కాగా ఈ వీడియోను ‘బాస్‌తో 101వ దోశ’ అన్న క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన కాసేపటికే లక్ష పైచిలుకు వ్యూస్ వచ్చాయి. ఇక ఈ వీడియోను చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఇక నిహారిక కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో భాగమైంది. ఇంటి ముందు ముగ్గులు, వరుణ్ దోశలతో సహా ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న సన్నివేశాలనంతటినీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
View this post on Instagram
]
చిరంజీవి ఇంట్లో భోగి వేడుకల వీడియోను ఇక్కడ చూడండి..