Merry Christmas 2019 Wishes: ప్రపంచం మొత్తం కలిసి సంవత్సరంలోని ఒకానొక సమయంలో వేడుకలు జరుపుకునే పండగ ఏదైనా ఉంటే, అది క్రిస్మస్ (Christmas) అయి ఉండాలి. యేసుక్రీస్తు (Jesus Christ) పుట్టినరోజైన డిసెంబర్ 25నే, కిస్మస్ పండుగగా ప్రపంచవ్యాప్తంగా గల క్రైస్తవులు అందరూ ఘనంగా జరుపుకుంటారు. ఇది ఒక్క క్రైస్తవులకు మాత్రమే పరిమితమైన పండగ కాదు, ఇటీవల కాలంలో క్రిస్మస్ యొక్క ఉల్లాసం ఇతర వర్గాలకు కూడా వ్యాపించింది. ఒక సుహృద్భావం వాతావరణంలో క్రిస్మస్ వేడుకలను స్కూళ్లు, కాలేజీలు మరియు కార్పోరేట్ ఆఫీసుల్లో కూడా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ చెట్లతో, మెర్రీ క్రిస్మస్ సందేశాలతో, రంగురంగుల లైట్లతో తమ పరిసరాలను అలంకరించుకుంటున్నారు. వివిధ శాంటా క్లాజ్ రూపాలతో మరియు సీక్రెట్ శాంటా పేర్లతో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం, ఉత్సాహంగా క్రిస్మస్ వేడుకలలో భాగస్వామ్యం అవడం చూస్తున్నాం.

ఇక క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ 24 సాయంత్రం నుండి ప్రారంభమవుతాయి, దీనిని 'క్రిస్మస్ ఈవ్' (Christmas Eve) అని కూడా పిలుస్తారు. అయితే, ఈ పండుగకు కొన్ని రోజుల ముందు నుంచే ఉత్సవం వాతావరణం కనిపిస్తుంది. ఈ క్రిస్మస్‌ను ఆనందాన్ని దానం చేసే, లేదా బహూకరించే సీజన్‌గా చెప్తారు. అందుకే ఈ పండుగకు హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ (Merry Christmas) అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. రంగు రంగుల లైట్లతో, బహుమతులతో అందంగా అలంకరించిన క్రిస్మస్ చెట్ల నుండి సంతోషాన్ని మోసుకొచ్చే శాంతా క్లాజ్ వరకు క్రిస్మస్ యొక్క ప్రతీ మూలం ఆనందాన్ని మరియు ఉల్లాసాన్ని వ్యాప్తి చేస్తుంది. అలాగే క్రిస్మస్ రోజున కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ఆత్మీయులతో కలిసి వేడుకలు జరుపుకోవడం, వారితో కలిసి నాణ్యమైన కాలాన్ని పంచుకోవడం ఈ వేడుకలలో అతి ముఖ్యమైన అంశం.

అలాగే క్రిస్మస్ పర్వదినాన జీసస్ క్రీస్తును అనుసరించే వారంతా చర్చిలకు వెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తారు. అలాంగా అర్ధారాత్రి డిన్నర్ మరియు క్రిస్మస్ పార్టీను జరుపుకొంటారు. తమ ప్రియమైనవారి ముఖంలో చిరునవ్వును వెలిగిస్తూ క్రిస్మస్ స్పూర్థిని చాటుతారు.

ఇక క్రిస్మస్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమైన సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోవడానికి కొన్ని మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు, హ్యాపీ హాలిడేస్ సందేశాలు, హ్యాపీ ఎక్స్-మాస్ వాట్సాప్ స్టిక్కర్లు మరియు ఫేస్‌బుక్ స్టేటస్ కోసం చిత్రాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.

మీ స్నేహితులతో కలసి కలిసి పార్టీ జరుపుకోవడానికి క్రిస్మస్ సరైన సమయం. ఎన్నో మాల్స్ మరియు రెస్టారెంట్లు క్రిస్మస్ కోసం ప్రత్యేక వేడుకలను ఆర్గనైజ్ చేస్తాయి. క్రిస్మస్ పార్టీ హౌజ్ పేరుతో కోరుకున్న వారికి కోరుకున్న విధంగా ఈవెంట్లు కూడా ప్లాన్ చేయబడి ఉంటాయి. వారం మధ్యలో మిమ్మల్ని పార్టీ మూడ్ లోకి తీసుకొచ్చి హుషారెత్తించేందుకు క్రిస్మస్ వచ్చేసింది. ఈ సందర్భంగా మెర్రీ క్రిస్మస్ మరియు హ్యాపీ హాలిడేస్ శుభాకాంక్షలు!