Nag-Panchami-Wishes-2

శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజును నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 21న నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ రోజు శ్రావణమాసం సోమవారం కావునా  దీని ప్రాముఖ్యత మరింత పెరగనుంది.  పాము పూజ మన సంస్కృతిలో ముఖ్యమైన భాగం. శివ భక్తులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. నాగ పంచమి రోజున నాగదేవతను పూజించడం వల్ల పాము కాటు భయం ఉండదని పండితులు చెబుతున్నారు. అలాగే అకాల మరణం పొందిన వారికి మోక్షం లభిస్తుంది. ఈ రోజున అనంత్, తక్షక్, పింగల్ నాగ్‌లను పూజించే ఆచారం ఉంది. వీరిని పూజించడం వల్ల రాహు-కేతు దోషాల నుండి విముక్తి లభిస్తుంది. దీనితో పాటు, కాలసర్ప దోషాన్ని వదిలించుకోవడానికి కూడా ఇది ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. నాగ పంచమి నాడు పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయని, లేకుంటే రాబోయే ఏడు తరాలకు అపరాధం తప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి.

Nag-Panchami-Wishes-1

పొరపాటున కూడా ఈ పని చేయకండి

నాగ పంచమి రోజున సర్ప దేవుడిని పూజించాలని ప్రత్యేక ఆచారం ఉందని పండితులు వివరించారు. ముఖ్యంగా ఈ రోజున ఏ పాముని బాధించకండి. బతికి ఉన్న పాముకి పాలు తాగించవద్దు, పాముకి పాలు విషం లాంటిది, కాబట్టి దాని విగ్రహానికి మాత్రమే పాలు సమర్పించండి. మరోవైపు, ఈ రోజున నేలను త్రవ్వవద్దు, చాలా సార్లు పాము నివాస స్థలాలు అయిన పుట్టలను త్రవ్వినప్పుడు పాములకు హాని కలిగిస్తాయి.

ఈ విశిష్టమైన రోజున నాగదేవతకు పూజలు చేసి ఆయన విగ్రహానికి పాలు, పండ్లు, పూలు తదితరాలను సమర్పించాలి. ఈ రోజున, సర్ప దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం ద్వారా, కాలసర్ప దోషం నుండి విముక్తి లభిస్తుంది. అలాగే అన్ని కోరికలు నెరవేరుతాయి.