
నాగుల చవితి భారతదేశంలోని అనేక దక్షిణాది రాష్ట్రాల్లో జరుపుకునే పవిత్రమైన రోజు. ఇది ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో ప్రధాన పండుగ. నాగపూజను ఆచరించడానికి ఈ రోజు శుభప్రదంగా పరిగణించబడుతుంది. కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత నాల్గవ రోజు నాగుల చవితి జరుపుకుంటారు. ఈ సంవత్సరం, నాగుల చవితి 2023 నవంబర్ 17, శుక్రవారం జరుపుకుంటారు. నాగుల చవితి అనేది నాగదేవతలను పూజించే పండుగ, ఇది వివాహిత స్త్రీలు ప్రధానంగా తమ పిల్లల శ్రేయస్సు కోసం ఆచరిస్తారు. నాగ చతుర్థి తర్వాత నాగ పంచమి, నాగషష్టి జరుపుకుంటారు. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసంలో కూడా జరుపుకుంటారు.

పరమశివుడు, నాగేంద్రుని ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ నాగుల చవితి శుభాకాంక్షలు.

మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు

ఆ నాగేంద్రుని శుభాశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ... నాగుల చవితి శుభాకాంక్షలు.

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మైన కారాయ నమ శివాయ ! నాగుల చవితి శుభాకాంక్షలు.

ఆ పరమేశ్వరుడు మీకు బలం మరియు శ్రేయస్సు అనుగ్రహించాలని కోరుతూ... ఆ నాగేంద్రుని ఆశీస్సులు మీ అందరిపైనా ఉండాలని ఆశిస్తూ...మీకు, మీ కుటుంబసభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు.

ఈ నాగుల చవితి రోజున అందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు..