National Girl Child Day Wishes (File Image)

National Girl Child Day 2022: మన దేశంలో జాతీయ బాలికల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటారు. 2008లో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తీసుకున్న చొరవ కారణంగా ప్రతియేడాది నేషనల్ గర్ల్ చైల్డే డే ను నిర్వహిస్తున్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న లక్ష్యం భారతదేశ బాలికలకు అండగా ఉంటామని చెబుతూనే, అవకాశాలను అందించడం. ఆడపిల్లల హక్కుల గురించి అవగాహన కల్పించడం, బాలిక విద్య యొక్క ప్రాముఖ్యత, వారి ఆరోగ్యం మరియు పోషణపై అవగాహన పెంచడం వంటివి దీని లక్ష్యాలుగా ఉన్నాయి.

అంతేకాకుండా, ఆడ శిశుహత్య నుంచి లింగ అసమానత నుండి లైంగిక వేధింపుల సమస్యలను తొలగించడం. బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలను ఎత్తిచూపడం, ఆడపిల్లల హక్కులు, విద్య, ఆరోగ్యం మరియు పోషణ యొక్క ప్రాముఖ్యతతో సహా అవగాహనను ప్రోత్సహించడం దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. ఈ రోజుల్లో కూడా లింగ వివక్ష అనేది బాలికలు లేదా మహిళలు జీవితాంతం ఎదుర్కొనే ప్రధాన సమస్య. జాతీయ బాలికల దినోత్సవాన్ని మొట్టమొదట 2008లో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ రోజు యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, మన సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న లింగ ఆధారిత వివక్ష గురించి అవగాహన కల్పించడం మరియు బాలికల పట్ల వైఖరిలో మార్పు తీసుకురావడం.

దీనిని మార్చడానికి, బాలికల పరిస్థితులను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా అనేక చర్యలు తీసుకుంది. ఈ వివక్షను తగ్గించడానికి సేవ్ ది గర్ల్ చైల్డ్, బేటి బచావో బేటి పధావో, ఆడపిల్లలకు ఉచిత లేదా సబ్సిడీ విద్య, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి అనేక ప్రచారాలు మరియు కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి.

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వాట్సప్ మరియు ఫేస్ బుక్ ద్వారా పంపే సందేశాలు మీకోసం...(National Girl Child Day 2022 Images & HD Wallpapers for Free Download Online)

National Girl Child Day Wishes (File Image)
National Girl Child Day Wishes (File Image)
National Girl Child Day Wishes (File Image)
National Girl Child Day Wishes (File Image)
National Girl Child Day Wishes (File Image)