
కార్తీక మాసం హిందూ మతంలో చాలా పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో వచ్చే ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వైకుంఠ చతుర్దశి ఉపవాసం ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల పక్షం చతుర్దశి తిథి నాడు ఆచరిస్తారు.
ఈ రోజున ప్రత్యేకించి శ్రీమహావిష్ణువు, మహాదేవుని పూజిస్తారు. ఈ రోజున పూజించడం వల్ల భక్తులకు విశేష ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం వైకుంఠ చతుర్దశి ఉపవాసం నవంబర్ 6న జరుపుకుంటారు.
వైకుంఠ చతుర్దశి రోజున విష్ణువు , శివుడు కలిసి పూజిస్తారని పురాణ గ్రంధాలలో చెప్పబడింది. ఈ రోజున తులసి ఆకులను లక్ష్మీ నారాయణుడికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి భక్తులకు మంచి జరిగేలా చూస్తుంది. అలాగే ఈ రోజున శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలి.
Chandra Grahan 2022: చంద్రగ్రహణం సమయంలో అన్నం తినొచ్చా ...
వైకుంఠ చతుర్దశి రోజున శ్రీమహావిష్ణువుకు తామరపూలను సమర్పించడం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుందని గ్రంధాలలో కూడా చెప్పబడింది. ఈ రోజున శివునికి కమలంతో పాటు తెల్లటి చందనాన్ని సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం పెరుగుతుంది.