Happy Makar Sankranti (File Image)

హిందూ మతంలో మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది దేశంలోని ప్రతి ప్రాంతంలో జరుపుకుంటారు. ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు పవిత్ర నదులలో స్నానం చేసి పుణ్యం పొందుతారు. సూర్యదేవుని పూజిస్తారు. ఈ రోజున సూర్యభగవానుడు ధనుస్సు రాశిని విడిచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యుడు ఒక రాశిని వదిలి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. ఈ సంవత్సరం మకర సంక్రాంతి పండుగ జనవరి 15న జరుపుకుంటారు,

మకర సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి..

జనవరి 14వ తేదీ రాత్రి 08.21 గంటలకు సూర్యభగవానుడు మకరరాశిలో సంచరిస్తాడు. ఉదయ తిథి ప్రకారం సంక్రాంతి పండుగను జనవరి 15 నాడు జరుపుకుంటారు. ఆ రోజు ఆదివారం. ఇది వ్యక్తికి మంగళకరమైన మరియు ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ముందు అంటే జనవరి 14న భోగి పండగ జరుపుకుంటారు.

పంచాంగం ప్రకారం, జనవరి 14 న రేవతి నక్షత్రం ఉంది మరియు జనవరి 15 న అంటే మకర శక్రాంతి, సర్వార్థ సిద్ధి యోగం, అమృతసిద్ధి యోగం , రాజపద యోగాల కలయిక చాలా పవిత్రమైనది. జనవరం 15న మకర సంక్రాంతి నాడు ఉదయం 5.43 నుండి సాయంత్రం 6.56 వరకు శుభ ముహూర్తాలు ఉంటాయి. మహా పుణ్యకాలం ఉదయం 5.43 నుంచి 7.55 వరకు ఉంటుంది.  జనవరి 14 న, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు, మరోవైపు, బుధుడు, శని ఇప్పటికే మకరరాశిలో ఉంటారు.

Grahanam 2023: కొత్త సంవత్సరం ఎన్ని సూర్య , చంద్ర గ్రహణాలు ఉన్నాయో తెలుసుకోండి..

మకర సంక్రాంతి ప్రాముఖ్యత

మకర సంక్రాంతి రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు దానం చేయడం వల్ల అనేక ఫలితాలు వస్తాయి. సంక్రాంతి రోజున సూర్యభగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి మారతాడు. చలికాలంలో రాత్రి పొడవుగా, పగలు తక్కువగా ఉండడానికి ఇదే కారణం. మరోవైపు, సంక్రాంతితో పగలు ఎక్కువై రాత్రి తగ్గుతుంది. ఈ పండుగ మన జీవితంలో అవసరమైన అన్ని సహజ దృగ్విషయాలకు ధన్యవాదాలు మరియు ప్రార్థించే సమయం. సూర్య భగవానుడు తనకు అందించిన అన్ని విజయాలు మరియు శ్రేయస్సు కోసం ప్రజలు పూజిస్తారు మరియు కృతజ్ఞతలు తెలుపుతారు. మకర సంక్రాంతి రోజున బెల్లం, నువ్వులు లేదా శనగపప్పును అవసరమైన వారికి దానం చేయండి. ఇలా చేయడం ద్వారా, వ్యక్తి తన జీవితాంతం ప్రయోజనాలను పొందుతాడు.