ఆరాధనకు సంబంధించిన అనేక విషయాలు పురాణ గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. ప్రతిదానికీ ఒక నియమం ఉంటుంది. పూజా సమయంలో దేవుడికి పూలు సమర్పిస్తాం. అయితే పూలను సమర్పించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా. ప్రతి పువ్వును ఇష్ట దేవతకు సమర్పించలేము. స్వామికి పుష్పాలు సమర్పించడం ద్వారా వారు ప్రసన్నులవుతారని నమ్ముతారు. కానీ వారికి తప్పుగా పుష్పాలను సమర్పిస్తే, వారి క్రోధానికి గురవుతారు. దేవతలకు పుష్పాలను సమర్పించడం ద్వారా వారు సంతోషిస్తారని, భక్తుల కోరికలన్నింటినీ నెరవేరుస్తారని హిందూ మతంలో నమ్ముతారు. కానీ పూజ సమయంలో కొన్ని పువ్వులు మానుకోవాలి. తెలుసుకుందాం.
పూజ సమయంలో ఈ పూలను ఉపయోగించవద్దు
>> శివపూజకు మొగలి పువ్వులు, తీగ మల్లె పువ్వులను ఉపయోగించకూడదు..
>> విష్ణు పూజకు ఉమ్మెత్త పువ్వులను వాడకూడదు..
>> అమ్మవారి పూజలకు జిల్లేడు పువ్వులను, పారిజాతాలను వాడకూడదు.
>> విఘ్నేశ్వరుని పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు.