Newdelhi, Mar 8: తెలుగు రాష్ట్రాలతో (Telugu States) పాటు దేశవ్యాప్తంగా శివాలయాల్లో (Lord Shiva Temples) మహాశివరాత్రి వేడుకలు (Mahashivratri Celebrations 2024) ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో ఇలా..
తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరం, చెర్వుగట్టు లింగమంతుల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. వరంగల్ లోని ప్రసిద్ధ ఆలయమైన వేయిస్తంభాల గుడిలో పునర్మిర్మాణం చేసిన కళ్యాణమండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడిలో పూజలు చేశారు. అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయం, పాలకుర్తి సోమేశ్వరాలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. పానగల్లులోని ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
🔴LIVE: Maha Shivaratri Celebrations | రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలుhttps://t.co/UVUToLNQKy pic.twitter.com/OJWZ17xUNf
— ETVTelangana (@etvtelangana) March 8, 2024
ఏపీలో అలా..
ఏపీలోనూ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీశైలం మల్లన్న క్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి ఆలయం, మహానంది ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలంలో అర్థరాత్రి 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చి ముక్కంటి దర్శనం చేసుకుంటున్నారు. లేపాక్షిలో మహాశివరాత్రిని పురస్కరించుకుని నేడు శివపార్వతుల కళ్యాణోత్సవం, రుద్ర హోమం, దీపోత్సవం నిర్వహించనున్నారు. రాజమండ్రిలో గోదావరి స్థాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
🔴LIVE: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు | Maha Shivaratri Celebrations Across Statehttps://t.co/NkZq0UTMWg pic.twitter.com/rKLdW7s41t
— ETV Andhra Pradesh (@etvandhraprades) March 8, 2024
దేశంలో వేడుకలు
దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శైవాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు.. పరమేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. కాశీ విశ్వనాథుని దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళ్ ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Maha Shivaratri | ఈ శైవక్షేత్రాల సం‘దర్శనం’.. ముక్తికి సోపానం..! తెలుగు రాష్ట్రాల్లోని ఈ శివాలయాలు ఎంతో ప్రత్యేకం..!https://t.co/R7BmncRoDx
— vidhaathanews (@vidhaathanews) March 7, 2024