మంగళవారం పంచముఖ ఆంజనేయస్వామిని పూజిస్తే మీ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పంచముఖ ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి, హయగ్రీవ స్వామి, వరాహ స్వామి, నృసింహ స్వామి, గరుడ స్వామి కలిసిన అత్యంత శక్తివంతమైన అవతారం. భూత, ప్రేత, గాలి, పిశాచాలను దగ్గరికి కుడా రాకుండా చేసే, క్షుద్ర భాదల నుండి కాపాడే శ్రీ పంచముఖ ఆంజనేయుడిని మంగళవారం ఏ విధంగా పూజించాలో చూద్దాం..
పంచముఖ ఆంజనేయుడి పూజ కోసం మీ సమీపంలోని ఆంజనేయ స్వామి ఉదయమే గుడికి వెళ్లి మొదట దర్శించుకోవాలి. ఆంజనేయస్వామికి 5 అంకె అంటే చాలా ఇష్టం. అందుకనే హనుమంతుడి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు, ఐదు అరటిపళ్ళు సమర్పించాలి.
Monday Pooja: సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ పనులు అస్సలు చేయవద్దు, పరమ శివుడి ఆగ్రహానికి గురవుతారు,
మీ ఇంట్లో ఎవరైనా జబ్బులతో బాధపడితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తే వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయి. మంగళవారం నాడు నుదుటన సింధూరం ధరించి హనుమంతుడిని పూజిస్తే లాభప్రదం.
మంగళవారం హనుమాన్ చాలీసా 11 మార్లు తగ్గకుండా పారాయణ చేయడం సుందర కాండ పారాయణ తో సమానం. ఇక 40 రోజులు హనుమాన్ చాలీసాని రోజుకి 11 మార్లు చొప్పున పారాయణ చేస్తే ఎటువంటి పనులైనా జారుతాయి. హనుమంతుడికి ప్రతి ఉదయం 11 ప్రదక్షిణలు చేయడంవలన సర్వ దోషాలు నశించి శుభం కలుగుతుంది. అంతేకాదు శ్రీరాముడికి పరమభకుడైన హనుమంతుడి కరుణా కటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి, భజన చేస్తే ఆ ప్రదేశానికి హనుమ ఎదో ఒక అవతారంలో వస్తాడని పెద్దల నమ్మకం.
ఇక మంగళవారం హనుమంతుడి పూజ చేసే భక్తులు ఆ రోజు మాంసాహారం పొరపాటున కూడా తినకూడదు. అలాగే మద్యం సేవించకూడదు. ఆ రోజు నిగ్రహంతో దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. అలాగే మనస్సులో జై శ్రీరాం అంటూ తలచుకోవాలి. స్త్రీలు, పిల్లలు, పెద్దలపై దుర్భాషలు ఆడరాదు. దైవ చింతనతో హనుమంతుడిని ఆరాధిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి.