Sankranti Pooja: మకర సంక్రాంతి అంటేనే ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చే పండగ సూర్య భగవానుడు ధనస్సు రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రాంతి వచ్చిందని అంటారు. మకర సంక్రాంతి పండుగను ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజున ఈ ముగ్గురు దేవతలకు పాయసం నైవేద్యంగా పెట్టినట్లయితే అనేక శుభ ఫలితాలు జరుగుతాయని నమ్మకం. ఆ దేవతలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
విష్ణుమూర్తి.. మకర సంక్రాంతి రోజున విష్ణుమూర్తికి చాలా విశిష్టమైన రోజు ఈ రోజున పూజ చేసుకున్న తర్వాత విష్ణుమూర్తికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉండి ఆర్థిక సమస్యలు తొలగిపోయి అనేక శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. గురుదోషాలు ఏమన్నా ఉంటే కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తిస్తుందని నమ్మకం.
Astrology: జనవరి 16 నుంచి శని గ్రహం రాశి మారుతుంది.
సూర్య భగవానుడికి.. మకర సంక్రాంతి సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన పండుగ ఈరోజున ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడు పోషించిన తర్వాత ఆ సూర్య భగవానుడికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసన్నం చేసుకుంటే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో గొడవలు సద్దుమణులుతాయి. ఆర్థిక పరంగా మంచి లాభాలు ఉంటాయి. సూర్య భగవానుడు ఆశీస్సులతో ఎల్లప్పుడూ మీరు సుఖ సౌఖ్యాలతో సంతోషంగా గడుపుతారు.
వినాయకుడికి.. మకర సంక్రాంతి రోజున వినాయకుడికి పూజ చేయడం ఆనవాయితీగా ఉంటుంది. విజ్ఞాన తొలగించే వినాయకుడికి మొదటిగా పూజ చేస్తారు. మకర సంక్రాంతి రోజున వినాయకుడికి పూజ చేసి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనేక కష్టాలు విఘ్నాలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని శుభ ఫలితాలు జరుగుతాయని నమ్మకం.
Disclaimer:పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.