Rama-Navami-2022-Wishes-in-Telugu_4

శ్రీ రామ నవమి ఏటా వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకుంటారు. ఎందుకంటే ఇదే రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీ రాముడు జన్మించడాని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయింది కూడా ఇదే రోజు. సీతారాముల కల్యాణం కూడా ఈ రోజునే జరిగిందని ప్రజలు విశ్వసిస్తున్నారు. దేశవ్యాప్తంగా శ్రీ రామ నవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి ఈ రోజు చేసే పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం ఆరు గంటలకే నిద్రలేచి తలంటు స్నానమాచరించాలి. అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంతో పాటు గుమ్మాలకు పసుపు, కుంకుమతో పాటు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులను వేయాలి. దేవుడి పటాలను పసుపు, కుంకుమలతో పూజించి పూజకు సిద్ధంగా ఉంచాలి. సీతారామ లక్ష్మణ, భరత శతృఘ్నులతో కూడిన భగవంతుడి చిత్ర పటాన్ని పూజకు ఉపయోగిస్తే మంచిది. పూలతో అలంకరించి.. నైవేద్యాన్ని సమర్పించాలి. పానకం, వడపప్పు తయారు చేసి భగవంతుడు ముందు ఉంచాలి.

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు, ఈ నెల 11న అసెంబ్లీ భవన ప్రాంగణంలోనే కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం..

శ్రీ రామ అష్టోత్తరం, శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీ రామాష్టకం, శ్రీ రామ సహస్రం, శ్రీమద్రామాయణం లాంటి స్త్రోత్రాలతో ఆ రఘురాముడిని స్తుతించాలి. అనంతరం శ్రీ రామ పట్టాభిషేకం కథను పారయాణం చేయడం ద్వారా శుభఫలితాలు అందుకుంటారు. ఇంటి దగ్గర రామాలయం సందర్శించుకుంటే మంచిది. లేకుంటే దగ్గర్లో పుణ్యక్షేత్రాలకు వెళ్తే శుభం జరుగుతుంది. భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ లాంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది.

దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీ రామ అష్టోత్తర పూజ, సీతారామకల్యాణం లాంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకల సిరిసంపదలు చేకూరుతాయి. నవమి రోజున ఉదయం 12 గంటలకు పూజ ప్రారంభించాలి. పూజకు కంచు దీపం, రెండు దీపారాధనలు. ఐదు వత్తులను ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి. పూజానంతరం శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీ రామ నిత్యపూజ లాంటి పూస్తకాలను తాంబులాలతో కలిపి ముత్తయిదువులకు ఇవ్వడం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.