శ్రీశ్రీ అని కూడా పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు, తెలుగు సాహిత్యం చలనచిత్రాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందిన విప్లవ కవి, అలాగే గేయ రచయిత. విశాఖపట్నంలో ఏప్రిల్ 30, 1910న శ్రీశ్రీ జన్మించారు. మహా ప్రస్థానం పేరిట ప్రచురించిన కవితల సంకలనం, అయన ప్రధాన రచనలలో ఒకటి. ఆయన ఉత్తమ చలనచిత్ర పాటల రచయితలలో ఒకడు, తెలుగులో 1000కి పైగా సినిమా పాటలకు ఆయన సాహిత్యం అందించాడు. శ్రీశ్రీ కవితలు రాయడమే కాకుండా మానవ హక్కుల కోసం కూడా పనిచేశారు మరియు 1974లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల కమిటీకి మొదటి అధ్యక్షుడు. ఆయన జాతీయ చలనచిత్ర అవార్డు, నంది అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
sri sri birth anniversaryఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం..
నరజాతి చరిత సమస్తం
పరపీడన పరాయణత్వం
నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి
ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం
నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి
కదిలేదీ కదిలించేదీ, మారేదీ మార్పించేదీ, పాడేదీ పాడించేదీ
పెను నిద్దర వదిలించేదీ మునుముందుకు సాగించేదీ,
పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ కావాలోయ్ నవకవనానికి
నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి
శ్రమ నిష్ఫలమై.... జనినిష్టురమై
అనాథలంతా... అశాంతులంతా....
దీర్ఘశృతిలో...తీవ్రధన్వితో.....
విప్లవశంఖం వినిపిస్తారోయ్...
నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి
పొలాలనన్నీ, హలాల దున్నీ,
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలికావించే,
కర్షక వీరుల కాయం నిండా ఘర్మ జలానికి,
ధర్మ జలానికి ఖరీదు లేదోయ్..
నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి