Subrahmanya Puja: వ్యాపారంలో నష్టపోతున్నారా, అయితే సుబ్రహ్మణ్య స్వామిని ఇలా పూజిస్తే, కష్టాలు పోయి, లాభాలు మీ సొంతం అవుతాయి...
Subramanyeshwara Swamy (Source : Wikipedia)

శివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోయి కష్టాలు సైతం తొలగి కుటుంబం ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతుందని పురాణాల్లో చెప్పారు.  సుబ్రహ్మణ్యస్వామి  నెమలి వాహనమెక్కి భక్తుల కష్టాలను తీర్చేందుకు లోక సంచారం చేస్తాడని శివపురాణం చెబుతోంది.  సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన మంగళవారం రోజు పూజిస్తే మీ కష్టాలు తొలగి మనసులో అనుకున్న పనులు నెరవేరుతాయని శివ పురాణంలో పేర్కొన్నారు. 

సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖుడు కార్తికేయుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. దేవతల సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతానం కలుగుతుందని పురాణాల్లో చెప్పారు ముఖ్యంగా మంగళవారం నాడు సంతానం కోరుకునే దంపతులు శివాలయం వెళ్లి అక్కడ సుబ్రమణ్య స్వామి విగ్రహం ఎదుట కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయాలి.  ఈ విధంగా పదకొండు మంగళవారాలు చేస్తే సంతానం కలుగుతుందని స్కంద పురాణంలో పేర్కొన్నారు. 

 అదేవిధంగా అప్పుల బాధతో సతమతమవుతున్నారా,  శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆరాధిస్తే మీ కష్టాలు తొలగి పోయి ఐశ్వర్య వంతులు అవుతారు.  ఇందుకోసం మీరు  మీ సమీపంలోని శివాలయంలో కొలువైన సుబ్రహ్మణ్యస్వామిని  మూడు మంగళ వారాలు పూజించి 21 ప్రదక్షణలు చేసి ఆవులకు అరటి పళ్ళు వినిపిస్తే  మీ కష్టాలు తొలగిపోతాయి. 

మీరెన్ని తగలబెట్టినా మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే, చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై మండిపడిన రేవంత్ రెడ్డి

 వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా అందుకోసం మీరు శ్రీ వల్లీ సమేత సుబ్రమణ్య స్వామి ఆరాధిస్తే సకల దోషాలు తొలగి మీ కష్టాలు తొలగిపోతాయి.  ఇందుకోసం మీ  వ్యాపార స్థలంలో తూర్పు దిక్కున  సుబ్రమణ్య స్వామి చిత్రపటం తగిలించి ప్రతిరోజు దీపం వెలిగించి అగరువత్తులు వెలిగించి కింద రాసిన స్తోత్రం చదవాలి.

సిందూరారుణ మిందు కాంతివదనం కేయూరహారాదిభిః

దివ్యైరాభరణైర్విభూషితతనుం స్వర్గాదిసౌఖ్యప్రదమ్ ।

అంభోజాభయ శక్తి కుక్కుటధరం రక్తాంగరాగోజ్జ్వలం

సుబ్రహ్మణ్యముపాస్మహే ప్రణమతాం భీతిప్రణాశోద్యతమ్ ॥