Suryagrahan 2022 Representational Image (Photo Credits: Pixabay)

ఈ సారి 2022లో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25న ఏర్పడనుంది. అయితే సూర్యగ్రహణం సమయంలో, చేయకూడని పనులు చాలా ఉన్నాయి. ఈ సమయంలో పూజలు చేయరు లేదా ఇతర పనులు చేయరు. అయితే ఈసారి సూర్యగ్రహణం మరియు దీపావళి ఒకేసారి వస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు సూర్యగ్రహణంతో సమయంలో లక్ష్మీ పూజ చేయలేరు, అలాగే దీపం కూడా వెలిగించకూడదు. మరి దీపావళి ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకుందాం. ఈ సంక్షోభం నివారించడానికి నివారించడానికి, మీరు కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో సంక్షోభాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

దీపావళి 2022: తేదీ, పూజ సమయం

ఈ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ 24, 2022 సాయంత్రం 05:27 తర్వాత

జరుపుకుంటే మంచిది, ఎందుకంటే అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఉంది. సూర్యగ్రహణం ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. ఈ రోజున పూజలు చేయకూడదు. అలాగే మరుసటి రోజు సూతక కాలం ముగిసే వరకూ పూజలు చేయకూడదు.

లక్ష్మీపూజ ఎప్పుడు జరుపుకోవాలి.

.ఒక వేళ మీరు లక్ష్మీ పూజ చేయాలనకుంటే అక్టోబర్ 24 రాత్రి 07:26 నుండి 08:39 వరకు జరుపుకోవాలి.

అమావాస్య తిథి ప్రారంభం - అక్టోబర్ 24, 2022న సాయంత్రం 05:27

అమావాస్య తిథి ముగుస్తుంది - అక్టోబర్ 25, 2022న సాయంత్రం 04:18

> సూర్యగ్రహణం రోజు నువ్వుల నూనెతో శని దేవుడికి అభిషేకం చేసి, శని చాలీసా పఠించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి.

Surya Grahan: దీపావళి రోజే సూర్య గ్రహణం, 27 సంవత్సరాల్లో ఇదే తొలిసారి, పండితులు హెచ్చరిస్తున్నారు, ఎందుకో తెలుసుకోండి..

>> జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం, దీపావళి ఒకే రోజున వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ రోజున దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

>> సూర్యగ్రహణం సమయంలో మీరు నూనె, పాదరక్షలు, చెక్క మంచం, గొడుగు, నల్ల బట్టలు మరియు ఉడకబెట్టిన పప్పును దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల శని దోషం తొలగి శుభ ఫలితాలు లభిస్తాయి.