శ్రావణ మాసం శివునికి, విష్ణువు, లక్ష్మీ దేవికి ప్రీతిపాత్రమైన మాసంగా చెప్పబడుతుంది. శ్రావణ మాసంలో కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ మాసంలో ఇంటికి ఎలాంటి వస్తువులు తీసుకురావాలో తెలుసుకుందాం. అధిక శ్రావణం 2023 ఆగస్టు 16న ముగుస్తుంది. నిజ శ్రావణ మాసం ఆగస్ట్ 17 నుండి ప్రారంభమవుతుంది. ఈ కాలంలో లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం చాలా మంది ఉపవాసం చేస్తారు. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు, శుభ ఫలాలను పొందేందుకు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావాలి. శ్రావణ మాసంలో మీరు ఈ వస్తువులను మీ ఇంటికి తీసుకురావడంతో లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందవచ్చు.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి
తులసి: తులసి హిందూ మతంలో చాలా పవిత్రమైన మొక్క. అందువల్ల ఈ పవిత్రమైన మొక్కను ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లలో ఉంచుతారు దీనికి తరచుగా నీరు పోసి, ప్రార్థనలు చేస్తారు. శ్రావణ మాసంలో మీ ఇంటిలో తులసి మొక్కను నాటడం వల్ల మీకు దైవానుగ్రహం, వివిధ ప్రయోజనాలు లభిస్తాయి. తులసి మొక్కను మీ ఇంటికి ఉత్తర దిశలో మట్టి కుండలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీకు, మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. మీ ఇంటి వాస్తు దోషాన్ని, ఆర్థిక సమస్యలను నివారిస్తుంది. మరియు పితరుల అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తుంది.
బంగారం: శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకోవడంతో సమానం. అందుకే ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తే మంచిది.
వెండి: శ్రావణ మాసంలో వెండితో చేసిన సామాన్లు కొంటే మంచిది. తద్వారా మీకు శుభం కలుగుతుంది.