గ్రహణం రోజు భారతదేశంలోని అన్ని దేవాలయాలను మూసివేస్తారు. సంప్రోక్షణ అనంతరమే మళ్ళి దేవాలయాలను తెరుస్తారు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అన్ని దేవాలయాలను ఈరోజు మూసివేస్తారు. కానీ కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం గ్రహణం వేళ తెరిచి ఉంటుంది. శ్రీ కాళహస్తి గుడి లో సూర్య గ్రహణం రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి గుడి లో ఈరోజు వాయులింగేశ్వర స్వామికి పూజలు కొనసాగుతున్నాయి.
పంచభూత లింగాలుగా మహాశివుడు భూమిపై అవతరించాడు. కంచీపురం, జంబుకేశ్వరం, తిరువణ్ణామలై, చిదంబరం, శ్రీకాళహస్తీ ప్రాంతాల్లో పంచభూత లింగాలకు ఆలయాలు ఉన్నాయి. సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో పంచభూత ఆలయాల్లో నాలుగింటిని మూసివేసి కేవలం వాయులింగేశ్వరుడికి మాత్రమే అభిషేకాలను నిర్వహిస్తారు.
WhatsApp Services Restored: హమ్మయ్యా..తిరిగి పనిచేస్తున్న వాట్సాప్, ఊపిరి పీల్చుకున్న యూజర్లు, దాదాపు రెండు గంటల పాటు పనిచేయని వాట్సాప్ సేవలు
సూర్య, గ్రహణ కాల సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేయనున్నారు. అలాగే గ్రహణం సమయంలో భక్తులకు జాతక దోషం పోగొట్టుకోవడానికి రాహుకేతు పూజలు కూడా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో రాహు దోషం కేతు దోషం పూజలు నిర్వహించే ప్రత్యేక దేవాలయం శ్రీకాళహస్తి. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ గుడిలోనే రాహు కేతు దోష నివారణ పూజలు చేయించుకున్నారు. అమితాబచ్చన్, ఐశ్వర్యారాయ్, సమంత, ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, అలాగే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు రాహు కేతు దోష పూజలు చేయించుకున్నారు.