Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఏప్రిల్, మేనెలలో పట్టిందల్లా బంగారమే, శుభవార్తలు వింటారు...
ఈ 4 రాశుల వాళ్ళకి అస్సలు తిరుగుండదని… ఏప్రిల్, మే రెండు నెలలు వాళ్ళకి అంతా అదృష్టమే అని ఉంటుందని.. మంచి కలుగుతుందని తెలుస్తోంది. అయితే మరి ఆ రాశులు ఏవి..? వాటిల్లో మీ రాశి కూడా ఉందో లేదో చూసుకోండి.
ఈ ఉగాది పర్వదినాన ప్లవ నామ సంవత్సరం పూర్తి చేసుకొని శ్రీ శుభకృత నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 1962 - 1963 లో వచ్చిన శుభకృత్ మళ్లీ 2022 - 2023లో వస్తోంది. అయితే ఈ ఏడాది జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ 4 రాశుల వాళ్ళకి ఎంతో బాగుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ 4 రాశుల వాళ్ళకి అస్సలు తిరుగుండదని… ఏప్రిల్, మే రెండు నెలలు వాళ్ళకి అంతా అదృష్టమే అని ఉంటుందని.. మంచి కలుగుతుందని తెలుస్తోంది. అయితే మరి ఆ రాశులు ఏవి..? వాటిల్లో మీ రాశి కూడా ఉందో లేదో చూసుకోండి.
వృషభ రాశి :
వృషభ రాశి వాళ్ళకి ఆర్థికంగా లాభంని చేకూరుస్తుంది. శుక్రుడు సంచారం వలన మంచిగా ఆర్థిక లాభాలు పొందొచ్చు. అలానే ఈ రాశి వాళ్ళకి ఎప్పటి నుండో ఉన్న పాత బకాయిలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. వచ్చే రెండు నెలలు కూడా ఎంతో సాధిస్తారు. ఎన్నో విజయాలని అందుకుంటారు.
మేష రాశి:
శుక్రుడు తన స్థానాన్ని మార్చుకోవడం మేషరాశి వారికి ఎంతో శుభప్రదం. మేష రాశి వాళ్ళకి అదృష్టం వస్తుంది. అలానే మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. మీరు ఏ పనినైనా చేసేటప్పుడు చిత్తశుద్ధితో చేయండి. ఇక విజయం తప్పక మీదే. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా మంచి సమయం ఇది. ఉద్యోగస్తులుకి కూడా మంచి కలుగుతుంది.
వృశ్చిక రాశి:
శుక్రుడు మార్పు ఈ రాశి వాళ్ళకి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఉద్యోగులకి మంచి కలుగుతుంది. అలానే ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్లు కూడా ఇదే మంచి సమయం అని చెప్పొచ్చు. ఆదాయం పెరుగుతుంది.
కర్కాటక రాశి:
ఈ రాశి వాళ్లకి వృత్తిపరంగా లాభం వస్తుంది. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నం తప్పక చేయండి ఎందుకంటే మీరు చేసే చిన్నపాటి ప్రయత్నం కూడా మీకు మంచినే ఇస్తుంది.
(The above story first appeared on LatestLY on Apr 04, 2022 12:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

