Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ రాశుల వారి ప్రేమ సక్సెస్ అవుతుంది, పెద్దల ఆశీర్వాదంతో ప్రేమ వివాహం జరిగే చాన్స్..
file

Ugadi Panchangam : ఈ ఉగాది పర్వదినాన ప్లవ నామ సంవత్సరం పూర్తి చేసుకొని శ్రీ శుభకృత నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 1962 - 1963 లో వచ్చిన శుభకృత్ మళ్లీ 2022 - 2023లో వస్తోంది. అయితే ఈ ఏడాది ఏయే రాశుల పురుషులు, స్త్రీలకు వారి ప్రేమ సక్సెస్ అవుతుందో చూద్దాం.

ఉగాదితో వచ్చే ఏడాది తమ భవితవ్యం ఎలా ఉంటుందోనని ముందుగానే అంచనాలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లి కావాల్సినవారు, ప్రేమలో ఉన్నవారు.. కొత్త సంవత్సరంలో తమ కొత్త జీవితం గురించి కలలు కంటున్నారు. ఈ నేపథ్యంలో శుభకృత నామ సంవత్సరంలో 2022-23లో మీ లవ్ లైఫ్ (Love Life) ఎలా ఉంటుందో విశ్లేషిస్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా 7 రాశుల వారికి సంవత్సరం ఎంతో రొమాంటిక్‌గా ఉంటుందని, వారి ప్రేమ సక్సెస్ అవుతుందని తెలిపారు. ఆ రాశులేంటో చూద్దాం.

వృషభం

సింగిల్ గా ఉన్న ఈ రాశి వారు వచ్చే సంవత్సరం ఎవరైనా ప్రత్యేక వ్యక్తిని కలిసే అవకాశముంది. అంతేకాకుండా వారితో సంబంధాన్ని కొనసాగించనున్నారు. వారిని భాగస్వామిగా తలిచి మీ జీవితంలో జరిగిన మధురమైన విషయాలను, జ్ఞాపకాలను పంచుకుంటారు. వారు కూడా మీతో రిలేషన్​షిప్​ను నెమ్మదిగా ప్రారంభించి ఎమోషనల్ బాండ్​ను ఏర్పరుచుకుంటారు. ఫలితంగా మీ ఇద్దరి బంధం ఆనందకరంగా సాగుతుంది.

కర్కాటకం

కర్కాటక రాశి వారు వచ్చే ఏడాది మీ జీవిత భాగస్వామిని కలుస్తారు. చంద్రుడు అధిపతిగా ఉండటం, స్వభావరీత్యా జలతత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారు వచ్చే ఏడాది జీవిత భాగస్వామితో ఎంతో విశ్వసీయనీయంగా, భావోద్వేగంగా ఉంటారు. ఈ సమయంలో కొన్ని కోరికలు, కలతలు ఉండవచ్చు. అయినప్పటికీ మీ భాగస్వామి వ్యక్తిత్వం వల్ల వారితో ఎమోషనల్ కనెక్షన్ పెరుగుతుంది. ఫలితంగా సంతృప్తి, ఆనందం ఉంటుంది.

కన్య

ప్రేమ పరంగా కన్యా రాశి వారిని అదృష్ట వంతులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం సింగిల్ గా ఉన్నవారు వచ్చే సంవత్సరం పాత స్నేహితుడు లేదా కొంతమంది కుటుంబ సభ్యుల ద్వారా తమ జీవిత భాగస్వామిని కనుగొంటారు. వారితో మొదటి చూపులోనే ప్రేమలో పడే అవకాశముంది. 2022 ఏప్రిల్ తర్వాత దీర్ఘకాలిక, స్థిరమైన సంబంధాన్ని కొనసాగిస్తారు. మొదట్లో మీ ప్రేమికులతో పెద్దగా కమ్యూనికేషన్ లేనప్పటికీ ఏడాది చివరకు ఇద్దరి మధ్య భావోద్వేగాలు, బంధాలు పెరుగుతాయి.

వృశ్చికం

వృశ్చిక రాశి ప్రజలు ఎప్పుడూ ఎమోషనల్​గా ఆలోచిస్తారు. వీరు సున్నిత మనస్కులు. జీవిత భాగస్వాములు తమకే సొంతమని(Possessive) భావిస్తారు. వారిపై ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటారు. 2022 మే మధ్య నుంచి వీరి రిలేషన్​షిప్​లో స్థిరత్వం ఉంటుంది. బృహస్పతి ఆశీస్సులతో తమ సంబంధాన్ని తర్వాతి దశకు తీసుకెళ్లగలుగుతారు. రొమాంటిక్ బంధాన్ని కలిగి ఉన్నవారు తమ కనెక్షన్ గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. అంతేకాకుండా కుటుంబానికి తమకిష్టమైనవారిని పరిచయం చేస్తారు.

ధనస్సు

ధనస్సు రాశి వారికి 2022 సంవత్సరం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఇప్పటికే రిలేషన్​షిప్​లో ఉన్నవారు ఈ సమయంలో తమ భాగస్వామి పట్ల అమితమైన ఇష్టాన్ని ప్రదర్శిస్తారు. ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. సింగిల్‌గా ఉన్నవారు ఏడాది చివరకు కొత్త వారికి ఆకర్షితులవుతారు.

మీనం

ఇప్పటికే రిలేషన్​షిప్​లో ఉన్నవారు ముందుగా వారి బంధంలో నూతన ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా తమ బంధంలో ఆనందాన్ని వెతుకుతారు. ఈ కాలంలో వారి బంధం మరింత అభివృద్ధి చెందుతుంది. వారి సంబంధంలో అచంచలమైన నమ్మకాన్ని పెంచుకుంటారు.

మకరం

ఇప్పటికే రిలేషన్​షిప్​లో ఉన్నవారు 2022 జూన్ నాటికి తమ భాగస్వామిని బాగా అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో కుజుడు సంచరిస్తున్నందున ఆగస్టు నాటికి తమ అనుబంధంలో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. అది గరిష్ఠ స్థాయికి చేరుతుంది. 2022 చివరి నాటికి మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశముంది. అయితే జులై మాసంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కోవచ్చు. సెప్టెంబరు, అక్టోబరు నాటికి అన్ని విషయాలు సజావుగా సాగుతాయి.