ప్రతీకాత్మకచిత్రం

Vasant Panchami 2022:  వసంత పంచమికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజున తప్పకుండా సరస్వతి దేవీని పూజించాల్సి ఉంటుంది. కానీ వసంత పంచమినాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడ కొన్ని పనులు మర్చిపోయి కూడా ఇవి చేయకూడదు. ఈ రోజున తప్పకుండా సరస్వతి దేవీని పూజించాలనే విధానముంది. ఎందుకంటే సరస్వతి దేవి ఈ రోజు జన్మించిందని విశ్వసిస్తారు. కాబట్టి హిందువులు ఈ పండుగ గురించి లోతైన విశ్వాసముంది. అంతేకాకుండా ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే వసంత పంచమినాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆ రోజు మర్చిపోయి కూడా కొన్ని పనులు చేయకూడదు. ఈ నేపథ్యంలో వసంత పంచమి రోజు ఏయే పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

చేయకూడని పనులు ఇవే...

> ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. ఎందుకంటే మీరు ఎవరి నుంచైతే జ్ఞానం, విద్యాబుద్ధులను పొందారో వారిని అవమానించడం వల్ల మీకే నష్టాలు కలుగుతాయి.

>> వసంత పంచమి పండుగ అనేది పచ్చదనం, పంటలకు సంబంధించింది. ఈ రోజు ఎలాంటి చెట్టు లేదా మొక్కను నరకడం లేదా తొలగించడం లాంటివి చేయకూడదు.

>> ఈ రోజు ఇంట్లో లేదా కుటుంబంలో ఎలాంటి వివాదాలు, తగాదాలకు లేకుండా జాగ్రత్త వహించండి. లేకుంటే సరస్వతీ దేవి ఆగ్రహానికి లోనుకావాల్సి వస్తుంది. ఫలితంగా ఇంట్లో సమస్యలు మొదలు కావడమే కాకుండా కెరీర్ పరంగాను ఇబ్బందులు ఎదురవుతాయి.

>> మద్యం, మాంసానికి తప్పనిసరిగా దూరం ఉండాలి.

హనీ ట్రాప్‌ వల నుంచి తృటిలో తప్పించుకున్న మంత్రి, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మోడల్‌ను బ్లాక్ మెయిల్ చేయడంతో ఆత్మాహత్యా ప్రయత్నం

చేయాల్సిన పనులు ఇవే...

>> ఈ రోజు సాత్వకాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే పండ్లు, కాయలు, పాలు మాత్రమే తీసుకోవాలి.

అంతేకాకుండా వసంత పంచమి రోజు వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం ద్వారా సరస్వతి దేవి కరుణించి కోరుకున్న కోరికలను తీరుస్తుంది. కెరీర్ పరంగా మంచి విజయం సాధిస్తారు.