Image used for representational purpose | (Photo Credits: PTI)

ఇంట్లో డబ్బును బీరువాలో, లేదా పెట్టెలో దాచుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బును ఏ దిశలో దాచుకోవాలో తెలుసుకుందాం. చాలా సార్లు ఇంట్లో డబ్బు దాచినప్పటికీ, మనకు కలిసి రాదు. వ్యాపారంలో నష్టాలో లేక దొంగతనాలు జరుగుతుంటాయి. దీనికి కారణం మనం వాస్తు ప్రకారం డబ్బును సరైన దిశలో దాచకపోవడం కూడా ఒక కారణం అవుతుంది.

డబ్బును ఈ దిశలో ఉంచడం వల్ల డబ్బు నష్టపోతాం

వాస్తు శాస్త్రం ప్రకారం, డబ్బు, విలువైన పత్రాలు ఆభరణాలు దాచుకునే బీరువా, లేదా పెట్టెను పశ్చిమం, అలాగే వాయువ్యంలో ఉంచకూడదు. ఈ దిశలో దాచితే మీకు ధన నష్టం, దొంగతనం జరిగే అవకాశం ఉందని పండితేలే చెబుతున్నారు. వాస్తులో వాయువ్య దిశ డబ్బుకు సంబంధించి తగినది కాదు.

ఈ దిశలో డబ్బు ఉంచడం వల్ల దొంగతనాల భయం ఉండదు.

వాస్తు నియమాల ప్రకారం, డబ్బు ఎల్లప్పుడూ నైరుతి దిశలో ఉంచాలి. దీంతో దొంగతనాల భయం తొలగిపోతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు ఈ దిశలో డబ్బును ఉంచినప్పుడు, అక్కడ కిటికీలు, తలుపులు ఉండకూడదు. ఈ నియమాలను అనుసరించడం ద్వారా, మీకు దొంగతనం వంటి సంఘటనల అవకాశాలను కూడా తగ్గించవచ్చు.