Vastu Tips For Rent House: అద్దె ఇంట్లో దిగుతున్నారా, అయితే వాస్తు రీత్యా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే, కిచెన్, బెడ్రూం ఏ దిక్కులో ఉండాలో ముందే తెలుసుకోండి..
(Photo Credit: social media)

Vastu Tips For Rent House:  మనం నివసించే ఇల్లు అన్ని విషయాల్లో బాగుండాలని కోరుకుంటాం. మనం ఉండేది అద్దె ఇల్లయినా సరే అన్ని సరిగ్గా ఉంటేనే ఉండేందుకు ఇష్టపడతాం. ఎందుకంటే వాస్తు ప్రభావం మనల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకే ముందుగానే ఇంటి వాస్తును అంచనా వేయడం మంచిది. లేదంటే తరువాత తర్వాత చాలా కష్టాలు వస్తాయి. ఇటీవల కాలంలో అద్దె ఇళ్లల్లోనే ఎక్కువ కాలం గడపాల్సి వస్తోంది. అద్దె ఇల్లయినా పక్కా వాస్తు ఉంటేనే దోషం లేకుండా ఉంటుంది. అప్పుడే మనకు బాగుంటుంది. ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాల్లో తిరిగే వారికి అద్దె ఇల్లే కదా ఆశ్రయం కల్పించేవి. అందుకే పక్కా వాస్తు ఉన్న ఇళ్లనే ఎంచుకుని తమ నివాసం ఏర్పరచుకోవడం ఉత్తమం.

మనం అద్దెకు తీసుకోబోయే ఇల్లు ప్రధాన ద్వారం ఈశాన్యంలో ఉందా? దక్షిణంగా ఉందా? అనేది తేల్చుకోండి. ప్రధాన ద్వారం ఈశాన్యంగా ఉంటేనే మనకు మంచిది. ఇంటి వంట గది ఎటు వైపు ఉందో చూసుకోండి. వంట గది ఎప్పుడు కూడా ఆగ్నేయంలోనే ఉండాలి. వాయువ్యం, నైరుతిలో గానీ కిచెన్ ఉంటే మంచిది కాదు. వంటిల్లుకి ఆగ్నేయమే బెటర్.

Astrology: ఈ మూడు రాశులకు వినాయకుడి కృపతో అదృష్టం వరిస్తుంది, మీ రాశి కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి..

ఇక బెడ్ రూం నైరుతి దిశలో ఉంటేనే మంచిది. లేకపోతే సమస్యలు వస్తాయి. మనం నిద్రించే చోటు కూడా మనకు కీడు తెస్తుంది. వాస్తు ప్రకారం లేకపోతే ఇబ్బందులు తప్పవు. తలుపులు కూడా లోపలి వైపు ఉండేలా చూసుకోవాలి. తలుపులు వేసేటప్పుడు తీసేటప్పుడు శబ్ధం రాకూడదు. ఒకవేళ చప్పుడు వస్తే మనకు మంచిది కాదు. అందుకే ఈ జాగ్రత్తల్ని పాటించి కొత్తగా చేరబోయే ఇంటిని ఎంచుకోండి. తరువాత కష్టాల పాలైతే ఇబ్బందులు పడతారు. అందుకే అద్దె ఇల్లయినా అన్ని ఉండాలని గుర్తుంచుకోండి.